Pushpa 2: బాలీవుడ్‌‌లో పుష్ఫ మేనియా.. షారూఖ్ రికార్డును బ్రేక్ చేసిన బన్నీ

Pushpa 2 Hindi Collections: బాలీవుడ్‌లో పుష్ప 2 మేనియా కొనసాగుతోంది. హిందీలో స్టార్ హీరోల ఓపెనింగ్ రికార్డులను బ్రేక్ చేసింది.

Update: 2024-12-06 10:26 GMT

Pushpa 2: బాలీవుడ్‌‌లో పుష్ఫ మేనియా.. షారూఖ్ రికార్డును బ్రేక్ చేసిన బన్నీ

Pushpa 2 Hindi Collections: బాలీవుడ్‌లో పుష్ప 2 మేనియా కొనసాగుతోంది. హిందీలో స్టార్ హీరోల ఓపెనింగ్ రికార్డులను బ్రేక్ చేసింది. తొలిరోజు రూ.67 కోట్ల వసూళ్లతో అద్భుతం సాధించింది. ఒక దక్షణాది సినిమా నార్త్‌లో తొలిరోజే ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం గొప్ప విషయమేనని బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాకు హయ్యెస్ట్ ఓపెనింగ్ రికార్డు ఉంది. కానీ ఇప్పుడు దాన్ని పుష్పరాజ్ బద్దలుకొట్టాడు.

హిందీ మార్కెట్‌లో అల్లు అర్జున్ సంచలనం సృష్టించాడు. హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా పుష్ప2 మూవీ నిలిచింది. ఇప్పటి వరకు ఈ రికార్డు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్న నటించిన జవాన్ మూవీ రూ.65.5 కోట్లతో హిందీ బాక్సాఫీసు వద్ద అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఉంది. ఇప్పుడు పుష్ప రూ.67 కోట్లతో ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఒక తెలుగు సినిమాకు బాలీవుడ్‌లో ఇంత ఇమేజ్ రావడంతో బన్నీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బన్నీ మాస్ లుక్, ఆయన డైలాగ్స్, డ్యాన్స్ ప్రేక్షకులను కట్టి పడేశాయంటున్నారు.

అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 చేస్తోన్న హంగామా మామూలుగా లేదు. దేశవ్యాప్తంగా ఊహకందని అంచనాలను సొంతం చేసుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.95.1 కోట్లు, హిందీలో రూ.67 కోట్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి రూ.13 కోట్ల వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. ఓవర్ సీస్‌లో తొలిరోజు దాదాపు 4.2 మిలియన్ల డాలర్లు .. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.35 కోట్లు వసూలు చేసినట్టు నిర్మాణ సంస్థ తెలిపింది. మొదటి రోజు పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్ల వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఇదిలా ఉంటే పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఆ చిత్రం ద్వారా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. గతంలో తెలుగులో ఏ హీరో కూడా సొంతం చేసుకోలేని అవార్డును బన్నీ దక్కించుకోవడం ఆయన కెరీర్ ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

Tags:    

Similar News