Allu Arjun: దీపిక ఎంట్రీ బ‌న్నీకి న‌చ్చ‌లేదా.? సోష‌ల్ మీడియాలో ఇప్పుడిదే ర‌చ్చ

Allu Arjun: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె తాజాగా అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో రూపొందుతున్న ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఈ సినిమా కోసం విడుదల చేసిన స్పెషల్ వీడియోలో ఆమెను ఒక సూపర్ ఉమెన్ పాత్రలో చూపించారు.

Update: 2025-06-08 07:00 GMT

అయితే సాధార‌ణంగా సినిమాల్లోకి హీరోయిన్ ఎంట్రీ అంటే హీరో నుంచి కనీసం ఓ పాజిటివ్ స్పందన వస్తుంది. కానీ ఈసారి అల్లు అర్జున్ మాత్రం పూర్తిగా మౌనంగా ఉన్నారు. దీపిక ఎంట్రీ వీడియోపై ఆయన ఇన్‌స్టాగ్రామ్, X (Twitter) లేదా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కడా స్పందించలేదు. ఇది చాలా మందిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తెలుగు ఫ్యాన్స్‌లో, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు, సందీప్ రెడ్డి వంగా అభిమానులలో దీపికపై ఉన్న నెగెటివ్ వైబ్ కారణంగా ఆమెని టాలీవుడ్‌కి తీసుకురావడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. "స్పిరిట్" సినిమాకు సంబంధించి గతంలో జరిగిన పరిణామాలే దీపిక మీద నెగెటివ్ ఫీల్‌కి కారణం. ఈ నేపథ్యంలో బన్నీ సైలెన్స్ చూసి ఇది ఓ వ్యూహమా? అనేది చర్చనీయాంశమైంది.

అయితే బ‌క్రీద్ శుభాకాంక్ష‌లు తెలిపిన బ‌న్నీ దీపికకా గురించి స్పందించ‌క‌పోవ‌డంతో ఈ అంశంపై ఎన్నో ప్ర‌శ్న‌లు త‌లెత్త‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. దీంతో బ‌న్నీ మౌనానికి అస‌లు కార‌ణం ఏంట‌న్న‌దానిపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై క్లారిటీ రావాలంటే అటు చిత్ర యూనిట్ లేదా బ‌న్నీ నేరుగా స్పందించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News