Pushpa - Saami Saami Song Release: బన్నీ "బంగారు సామీ..మీసాల సామీ"గా వచ్చేసాడు
Pushpa Third Single Saami Saami Song: (Photo: Twitter)
Pushpa Movie - Saami Saami Song Release: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన జంటగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'. ఇప్పటికే పుష్ప నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగ్‌ల్‌తో పాటు ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా అక్టోబర్ 28 గురువారం రోజు 11.07 నిమిషాలకు "పుష్ప" సినిమా మూడో సింగిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
"నువ్వు అమ్మి అమ్మి అంటుంటే.. నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ" అంటూ సాగే ఈ మూడో పాటను విడుదల చేశారు. ఈ పాటను అటు తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ, కన్నడ భాషలలో విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యొక్క మొదటి పాట "దాక్కో దాక్కో మేక పులోచ్చి కొరుకుద్ది పీక", రెండో పాట 'చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి' పాటలు సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు మూడో పాట కూడా సంగిత ప్రియులను అలరించనుంది. డిసెంబర్ 17 న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.