బన్నీఖాతాలో అరుదైన ఘనత .. తొలి తెలుగు హీరోగా రికార్డు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో' చిత్రానికి మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' చిత్రానికి మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఈ ఘనత సాధించి తొలి తెలుగు హీరోగా బన్నీ నిలిచాడు. అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన చిత్రం 'అల.. వైకుంఠపురములో'.. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఈ సినీమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు వసూళ్ల పరంగానూ సునామీ సృష్టించింది. జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' 'అల.. వైకుంఠపురములో'. హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. అల.. వైకుంఠపురములో' సినిమా తర్వాత అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్‌తో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఇందులో బన్నీ మాస్ లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
'అల.. వైకుంఠపురములో' ప్రీమియర్ షోల నుంచే హిట్ టాక్‌ను అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 160 కోట్ల షేర్ రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్లో అయితే 3.5 మిలియన్ మార్కును అలవోకగా దాటింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరూ సరసన మూవీ పోటీని తట్టుకొని ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.
అల.. వైకుంఠపురములో' సినిమాకు ముందే ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతానికి స్పందన వచ్చింది. ఈ మధ్య అలకు సంబంధించిన వీడియో సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. వాటికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 50 రోజులు పూర్తి చేసుకున్న 'అల.. వైకుంఠపురములో' ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇండియాలోనే టాప్ టెన్ మూవీస్ లిస్టులో విడుదలైన మొదటి రోజే చోటు సంపాదించింది. ఈ చిత్రం రెండు రోజులకే నెంబర్ వన్ ప్లేస్‌ను చేరుకుంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా చేరుకోలేదు. దీంతో అల్లు అర్జున్ మరో ఘనత సాధించాడు.