Allu Arjun: అల్లు అర్జున్ మరో ఘనత.. హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పై బన్నీ ఫొటో
హీరో అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా హాలీవుడ్‌ను సైతం ఆకర్షించడంతో గ్లోబల్ స్టార్‌గా మారారు.
అల్లు అర్జున్ మరో ఘనత.. హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పై బన్నీ ఫొటో
Allu Arjun: హీరో అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా హాలీవుడ్‌ను సైతం ఆకర్షించడంతో గ్లోబల్ స్టార్‌గా మారారు. పుష్ప2తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన బన్నీ.. తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు . ప్రపంచ ప్రఖ్యాత సినీ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్.. ది హాలీవుడ్ ఇండియన్ ఎడిషన్ పేరుతో భారత్‌లోనూ అడుగు పెట్టింది. అయితే ఈ మ్యాగజైన్ తొలి సంచిక కవర్ పేజ్‌కి అల్లు అర్జున్ ఫోటోను ఎంపిక చేయడం విశేషం.
ఇప్పటి వరకు బాలీవుడ్ టాప్ హీరోలకు కూడా దక్కని గౌరవం ఇప్పుడు బన్నీకి దక్కడం పట్ల అభిమానులు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ది హాలీవుడ్ రిపోర్టర్ 1930 నుంచి డైలీ ట్రేడ్ పేపర్‌గా విదేశాల్లో చాలా పేరుగాంచింది. ఈ పత్రికకు ఆన్ లైన్ ఎడిషన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ మ్యాగజైన్ ఇండియన్ మార్కెట్ పై దృష్టి పెట్టి భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ కవర్ పేజీ ఫొటో షూట్‌ను కూడా నిర్వహించింది. ఇందులో భాగంగా అల్లు అర్జున్ కొన్ని విషయాలను పంచుకున్నారు.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. నా జీవితంలో లభించిన అతిపెద్ద అవకాశం ఇదే అని భావిస్తున్నానని అన్నారు బన్నీ. బలం, ఆత్మవిశ్వాసం అనేది మనసులో ఉంటాయి. కానీ కొన్ని లక్షణాలు మాత్రం పుట్టుకతో వస్తాయి. ఇది అలాంటిదే. విజయం సాధించిన తర్వాత కూడా వినయంగా ఉండడం చాలా ముఖ్యమన్నారు. కానీ సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేని చాలా మందిని చూశాను. ఏదైన వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుందన్నారు. తాను మాత్రం ఎంత ఎదిగిన వంద శాతం సామాన్యుడినే అన్నారు అల్లు అర్జున్.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప2 సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ.1871 కోట్లు వచ్చాయి. పుష్ప2 దేశంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండోవ సినిమాగా నిలిచింది. ఇదిలా ఉంటే బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ దర్శకత్వంలో రెండు సినిమాల్లో నటించబోతున్నారు.