Alia Bhatt: ఆ హీరోయిన్‌ను పొగడ్తలతో ముంచేసిన ఆలియాభట్
సాధారణంగా సినిమా పరిశ్రమలో ఒక హీరోయిన్ మరో హీరోయిన్ పొడగడం చాలా అరుదు. కానీ ఆలియా భట్ మాత్రం తన ఇగో పక్కన పెట్టి.. తన తోటి హీరోయిన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
ఆ హీరోయిన్‌ను పొగడ్తలతో ముంచేసిన ఆలియాభట్
Alia Bhatt: సాధారణంగా సినిమా పరిశ్రమలో ఒక హీరోయిన్ మరో హీరోయిన్ పొడగడం చాలా అరుదు. కానీ ఆలియా భట్ మాత్రం తన ఇగో పక్కన పెట్టి.. తన తోటి హీరోయిన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. తను నటించిన సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. ఇంతకీ ఆలియా అంతలా పొగిడిన ఆ హీరోయిన్ ఎవరో.. తనకు అంతలా నచ్చిన సినిమా ఏంటో చూద్దాం.
రష్మిక మందన్న తన నటనతో ప్రేక్షకులతో పాటు తోటి హీరోయిన్లను సైతం ఆకట్టుకుంటోంది. ఇటీవల విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ఛావా సినిమా దేశవ్యాప్తంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. అయితే ఇటీవల ఛావా సినిమాను చూసిన ఆలియా భట్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఛావా ఓ అద్బుతం. ముందుగా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్‌కు అభినందనలు. చాలా గొప్పగా తీశారు. విక్కీ కౌశల్ అద్భుతంగా నటించారు. నా అభిమాన నటుడు అక్షయ్ ఖన్నా ఔరంగజేబుగా మారిపోయారు అంటూ ప్రశంసించారు.
ఇక రష్మిక మందన్నా గురించి చెబుతూ తను చాలా అందంగా ఉంది. ముఖ్యంగా తన కళ్లు అంటూ ప్రశంసలు గుప్పించారు ఆలియా భట్. అలియా పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకల కామెంట్స్ చేస్తున్నారు. తన తోటి నటిని ప్రశంసించడం మీ వ్యక్తిత్వానికి నిదర్శనమంటూ కొనియాడుతున్నారు.
ఇక ఆలియా భట్ సినిమాల విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు అలియా. ప్రభాస్-హనురాఘవపూడి కాంబినేషనల్‌లో వస్తున్న ఫౌజీ సినిమాలో ఆలియా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా బ్రిటీష్ రాణిగా కనించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఇక రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతోంది. పుష్ప2 సినిమా తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక అక్కడ కూడా మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లో వరుస అవకాశాలను చేజిక్కింటుకుంటూ హిట్ మీ హిట్ కొట్టేస్తుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో సికిందర్, ధనుష్ తో కుబేర చిత్రాల్లో నటిస్తోంది.