చీఫ్ గెస్ట్ లేకుండానే 'అల' ప్రీ రిలీజ్ ఈవెంట్
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' అనే సినిమాని చేస్తున్నాడు.
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' అనే సినిమాని చేస్తున్నాడు .. ఈ సినిమాని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు . ప్రస్తుతం షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా శుక్రవారం సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకోనుంది.
సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ రిలీజ్ విషయంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరును పెంచేసింది. అందులో భాగంగానే ఈ నెల 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనుంది. అయితే ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రానున్నారని వార్తలు వచ్చాయి కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు.
కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ కి ఎవరు చీఫ్ గెస్ట్ గా రావడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి చివరి నిమిషంలో ఎవరినైనా తీసుకువస్తారేమో చూడాలి. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, జయరామ్, మురళీశర్మ, సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ కలి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. దానికితోడు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల తర్వాత బన్ని, త్రివిక్రమ్ కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.