Akhil-Zainab Wedding: సైలెంట్‌గా పెళ్లి ప‌నులు మొద‌లు పెట్టిన అక్కినేని కుటుంబం.. అఖిల్ వివాహం ఎక్క‌డో తెలుసా?

Akhil-Zainab Wedding: అక్కినేని కుటుంబంలో మళ్లీ శుభకార్యాల సన్నాహాలు మొదలయ్యాయి. గతేడాది నాగచైతన్య, శోభితాల వివాహం జ‌ర‌గ్గా. ఇప్పుడు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు.

Update: 2025-06-04 08:30 GMT

అఖిల్ వివాహం ఇదే నెలలో జరగనుంది. అయితే అఖిల్ వివాహ తేదీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. కానీ పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను నాగార్జున స్వయంగా కలిసి వివాహానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే.

ఇక అఖిల్ వివాహాన్ని హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా వివాహం అనంతరం రాజస్థాన్‌లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. అయితే, ఈ వేడుక కుటుంబానికి చెందిన వారితో మాత్రమే జరుగుతుందని, సినీ ప్రముఖులు పెళ్లి కార్యక్రమానికి మాత్రమే హాజరవుతారని సమాచారం.

2023 నవంబర్ 26న అఖిల్, జైనాబ్ రవ్‌జీ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. జైనాబ్ అనేది జైపాల్ పేయింటింగ్స్‌కు చెందిన కళాకారిణి. ఇదిలా ఉంటే గతంలో అఖిల్ నిశ్చితార్థం డిజైనర్ శ్రీయ భూపాల్‌తో జరిగిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజులకే ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయ్యింది.

Tags:    

Similar News