పుష్ప తగ్గినా అఖండ మాత్రం తగ్గటం లేదుగా

Sankranthi: డిసెంబర్లో విడుదలై బ్లాక్ బస్టర్ లు గా మారి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమాలలో మొదటిది

Update: 2022-01-13 15:00 GMT

పుష్ప తగ్గినా అఖండ మాత్రం తగ్గటం లేదుగా

Sankranthi: డిసెంబర్లో విడుదలై బ్లాక్ బస్టర్ లు గా మారి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమాలలో మొదటిది బాలకృష్ణ హీరోగా నటించిన "అఖండ" మరియు రెండవది అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప: ది రైజ్". మధ్యలో ఎన్ని సినిమాలు విడుదల అయినప్పటికీ ఈ రెండు సినిమాలు మాత్రం బాక్సాఫీస్ ని తమ కలెక్షన్లతో బద్దలుకొట్టి సరికొత్త రికార్డులను ఎప్పటికప్పుడు సృష్టిస్తూ వచ్చాయి. డిసెంబర్ 2 న విడుదలైన అఖండ విడుదలైన నెల తరువాత కూడా థియేటర్లను హౌస్ఫుల్ చేయగా తెలుగులో మాత్రమే కాక హిందీలో కూడా పుష్ప జోరు బాగానే కొనసాగింది.

అయితే తాజా సమాచారం ప్రకారం అఖండ సినిమా కి సంక్రాంతి సీజన్ కూడా బాగా కలిసొచ్చేటట్టు ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఇంకా థియేటర్లో రన్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో "పుష్ప" విడుదల అయిపోయింది. కానీ అఖండ సినిమా మాత్రం జనవరి 21న విడుదల కాబోతోంది. సంక్రాంతి బరిలో "బంగార్రాజు" తప్ప పెద్ద ఎదురు చూసే సినిమాలు లేవు. అందుకే "అఖండ" సినిమాకి ఇది ప్లస్ పాయింట్ అయ్యేలా ఉందని తెలుస్తోంది. ఇక తమ పూర్తి థియేటరికల్ పూర్తి అయ్యే లోపల ఈ రెండు సినిమాలు ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాయో వేచి చూడాలి.

Tags:    

Similar News