Akhanda 2: హైదరాబాద్‌లో ప్రీమియర్ షో టికెట్ల హడావిడి – అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది?
తెలంగాణలో అఖండ 2 ప్రీమియర్ షోలపై 14 రీల్స్ ప్లస్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వెబ్‌సైట్లలో డే–1 అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులో ఉండగా, ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చిందని సంస్థ తెలిపింది.
Akhanda 2 : హైదరాబాద్‌లో ప్రీమియర్ షో టికెట్ల హడావిడి – అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది?
తెలంగాణలో అఖండ 2 ప్రీమియర్ షోలపై 14 రీల్స్ ప్లస్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వెబ్‌సైట్లలో డే–1 అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులో ఉండగా, ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చిందని సంస్థ తెలిపింది. ప్రత్యేకంగా, ప్రీమియర్ షో టికెట్లు గురువారం ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు 14 రీల్స్ ప్లస్ ‘ఎక్స్’ ఖాతా ద్వారా ప్రకటించింది.
బుక్ మై షోలో గత 24 గంటల్లోనే అఖండ 2 కోసం 1.12 లక్షలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయని ఆ ప్లాట్‌ఫారమ్ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్ షో బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. నైజాంలో, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ప్రీమియర్ షోలకు భారీ డిమాండ్ ఉంటుందని బాలయ్య అభిమానులు అంచనా వేస్తున్నారు. అఖండ 2 ప్రీమియర్ షో టికెట్ ధర ₹600 గా ఫిక్స్ చేయబడింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రీమియర్ రేట్లను ₹600 వరకు అనుమతించాయి.
అఖండ 2: తాండవం – సినిమా గురించి
‘అఖండ 2: తాండవం’ చిత్రం సనాతన ధర్మం, నమ్మకం, భక్తి నేపథ్యంతో సాగుతుందని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట తెలిపారు. బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ పాన్–ఇండియా చిత్రం డిసెంబర్ 12న భారీగా విడుదలకానుంది.
నిర్మాతలు మాట్లాడుతూ –
‘లెజెండ్’ తర్వాత బాలయ్య గారితో చేస్తున్న పెద్ద సినిమా ఇది. ఈ సారి కథ స్కేల్ పెద్దది. కొన్ని కీలక సన్నివేశాలను కుంభమేళాలో చిత్రీకరించామని పేర్కొన్నారు.