Akhanda 2: అఖండ 2 తాండవానికి ఓటీటీ డీల్ ఫిక్స్ అయిందా?
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ ఎంత భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సక్సెస్ తర్వాతే సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. ప్రస్తుతం అఖండ 2 సీక్వెల్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి.
Akhanda 2: అఖండ 2 తాండవానికి ఓటీటీ డీల్ ఫిక్స్ అయిందా?
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ ఎంత భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సక్సెస్ తర్వాతే సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. ప్రస్తుతం అఖండ 2 సీక్వెల్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ముఖ్యంగా VFX వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికి పూర్తి కావడం కష్టమేనన్న ప్రచారాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
అయినా కూడా దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో బాలకృష్ణ ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నారని సమాచారం. ఇదిలా ఉంటే, అఖండ 2 ఓటీటీ హక్కుల రేసులో జియో హాట్‌స్టార్ ముందంజలో ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ కంటే ఎక్కువ ధర ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ జియో హాట్‌స్టార్‌దేనని టాక్. అయితే థియేట్రికల్ రిలీజ్ మాత్రం ఇంకా అనిశ్చితంగా ఉంది. సినిమా పూర్తి అవుట్‌పుట్ వచ్చాకే సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందా లేదా అన్న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.