22 ఏళ్ల తర్వాత మళ్లీ ఐశ్వర్యరాయ్ తో అజిత్
* రెండు దశాబ్దాల తర్వాత ఆ హీరోయిన్ తో నటించనున్న అజిత్
22 ఏళ్ల తర్వాత మళ్లీ ఐశ్వర్యరాయ్ తో అజిత్
Aishwarya Rai Bachchan: కోలీవుడ్ లో స్టార్ స్టేటస్ ఉన్న అజిత్ కి తెలుగులో కూడా మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యనే అజిత్ హీరోగా నటించిన తమిళ్ సినిమా "తునీవు", తెలుగు లో "తెగింపు" అనే టైటిల్ తో విడుదలైంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. మంజు వారియర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సముద్రఖని కీలక పాత్రలో కనిపించారు. బోనీకపూర్ ఈ సినిమాని నిర్మించారు.
అటు తమిళ్లో కానీ ఇటు తెలుగులో కానీ ఈ సినిమా అనుకున్న విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది. తాజాగా ఇప్పుడు అజిత్ తన నెక్స్ట్ సినిమా ను మొదలుపెట్టే పనుల్లో బిజీ అయిపోయారు. తాజా సమాచారం ప్రకారం అజిత్ ఇప్పుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ రవి చందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఎప్పుడో 2000 లో "కండు కొండెన్ కండు కొండెన్" అనే తమిళ్ సినిమాలో అజిత్ మరియు ఐశ్వర్యారాయ్ కలిసి కనిపించారు. అయితే వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా కాకపోయినాప్పటికీ, అజిత్ సరసన టబు మరియు మమ్ముట్టి సరసన ఐశ్వర్యాలు ఈ సినిమాలో కనిపించారు. మళ్లీ 22 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు.