టాలీవుడ్ హీరోలంటే పడి చస్తా… నా ఫేవరెట్ హీరో అతనే
టాలీవుడ్ హీరోలంటే తనకు ఎంత ఇష్టమో వెల్లడించిన మాజీ భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ “టాలీవుడ్ హీరోలంటే పడి చస్తా” అంటూ తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పాడు. సెహ్వాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2015 లో వీరేంద్ర సెహవాగ్ అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లు ఐపిఎల్ నుండి తన పదవి విరమణను ప్రకటించారు. ఆ తర్వాత తాను ఏం చేస్తున్నారో హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు ఆయన. తాను క్రికెట్ నుంచి విరమణ పొందిన తర్వాత మహేష్ అల్లు అర్జున్ ప్రభాస్ సినిమాలు చూడడం తప్ప తనకు చేయడానికి ఏం లేదు అని చమత్కరించారు. అంతేకాదు హార్డ్ హిటర్ సేవ్ తనకు ఇష్టమైన తెలుగు హీరో మహేష్ బాబు అని పేర్కొన్నారు.