Major Teaser: 'మేజర్' టీజర్ విడుదల

Major Teaser: మేజర్ సినిమా టీజర్ రిలీజైంది. తెలుగు వర్షన్ ను మహేశ బాబు, హిందీ వర్షన్ ను సల్మాన్ ఖాన్ విడుదల చేశారు.

Update: 2021-04-12 11:03 GMT

మేజర్ సినిమాలో అడివి శేష్ (ఫొటో ట్విట్టర్)

Major Teaser: అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా టీజర్ రిలీజైంది. తెలుగు వర్షన్ ను మహేశ బాబు, హిందీ వర్షన్ ను సల్మాన్ ఖాన్ విడుదల చేశారు. 1.34 నిమిషాలు ఉన్న ఈ టీజర్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.

26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని క్రుష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శశికిరణ్ తిక్కా డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు.

సోనీ పిక్చర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ+ఎస్‌ మూవీస్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, రేవతి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. దీన్ని తెలుగు, హిందీ, మలయాళంలో జులై 2న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Full View

Tags:    

Similar News