Actress: సౌందర్య నటించి, నిర్మించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా.?
Soundarya: సౌందర్య ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అద్భుతమైన నటన, సహజమైన అభినయంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకుని, దక్షిణ భారత చిత్రపరిశ్రమలో ఒక వెలుగు వెలిగింది.
Actress: సౌందర్య నటించి, నిర్మించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా.?
Soundarya: సౌందర్య ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అద్భుతమైన నటన, సహజమైన అభినయంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకుని, దక్షిణ భారత చిత్రపరిశ్రమలో ఒక వెలుగు వెలిగింది. గ్లామర్‌కు అతీతంగా సంప్రదాయ శైలిలో కనిపిస్తూ, కేవలం తన ప్రతిభతోనే నంబర్ వన్ హీరోయిన్‌గా నిలిచింది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్రనటులతో స్క్రీన్‌ను షేర్ చేసుకుంది. అయితే, కెరీర్ పీక్‌లో ఉండగానే అనూహ్యంగా మరణించి సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. రాజకీయాల్లో అడుగుపెడుతున్న తరుణంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించిన విషయం తెలిసిందే.
ఇక సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. ఆమె కర్ణాటకలో జన్మించింది. ఆమె తండ్రి సత్యనారాయణ అయ్యర్ కన్నడ చిత్ర పరిశ్రమలో రచయిత, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రేరణతోనే సౌందర్య సినిమాల్లోకి అడుగుపెట్టింది. చిన్న పాత్రతో తన ప్రయాణాన్ని ప్రారంభించి, క్రమంగా టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.
తండ్రి ఆకస్మిక మరణం ఆమెను తీవ్రంగా కలచివేసింది. ఆయన జ్ఞాపకార్థం, 2002లో సత్య మూవీ మేకర్స్ బ్యానర్‌ను స్థాపించి తీవు అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది. మహిళా కేంద్రిత ఈ సినిమాకు గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించారు. ఇందులో సౌందర్య హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం రెండు జాతీయ అవార్డులను గెలుచుకోవడం విశేషం. ఇలా సౌందర్య నటించి, తెరకెక్కించిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది.