వరలక్ష్మి నీకు సిగ్గుందా.. ? నటి స్నేహ భర్త కామెంట్

Update: 2020-02-10 16:21 GMT
Sneha husband prasanna , varalakshmi

తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. విశాల్ నటించిన తమిళ చిత్రం పదెం కోడి-2 తెలుగులో కూడా అనువాదం అయింది. ఆ చిత్రంలో వరలక్ష్మీ లేడీ విలన్ గా నటించారు. ఆ సినిమాలో ముఖ్య పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయ్యారు. 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమాతో టాలీవుడ్‌లో రంగప్రవేశం చేశారు. సినిమాలో కూడా ఆమె విలన్ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు మాస్ మహారాజా 'క్రాక్' రవితేజ నటిస్తున్న సినిమాలోనూ మంచి పాత్ర పోషిస్తున్నారు.

తాజాగా ఆమె తెలుగులో అల్లరి నరేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'నాంది' అనే సినిమాలో వరలక్ష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఫస్ట్‌లుక్ చిత్ర బృధం విడుదల చేసింది. ఆ సినిమా ఫస్ట్ లుక్‌లో నరేష్ న్యూడ్ గెటప్ లో కనిపిస్తారు. అయితే 'నాంది' సినిమాలో తన లుక్‌ను వరలక్ష్మి ట్విటర్‌లో షేర్ చేశారు. ఇక దీనిపై ప్రముఖ నటి స్నేహ భర్త ప్రసన్న చేసిన కామెంట్ సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ఒకప్పుడు అలా సిగ్గుపడేదాన్ని అని క్యాప్షన్ ఇచ్చారు. స్నేహ భర్త నటుడు ప్రసన్న కామెంట్ చేశారు. నీకు సిగ్గు కూడా ఉందా? అంటూ ఆయన కామెంట్ పెట్టారు. వరలక్ష్మి రిప్లై ఇస్తూ.. అందుకే ఒకప్పుడు అని క్యాప్షన్ ఇచ్చాను అని ట్వీట్ చేశారు. . 'నిబునన్' అనే తమిళ చిత్రంలో వరలక్ష్మి, ప్రసన్న కలిసి నటించారు.



Tags:    

Similar News