Rashmika Mandanna: ఈ సినిమా తర్వాత రిటైర్ అవ్వాలనిపించింది.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈ సినిమా తర్వాత రిటైర్ అవ్వాలనిపించింది.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rashmika Mandanna: రష్మిక.. ఇప్పుడీ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కన్నడ ఇండస్ట్రీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా మారింది. భారీ విజయాలతో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో నటించిన హీరోయిన్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా పుష్ప2 మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఏకంగా రూ. 1800 కోట్లు వసూలు చేసింది.
కన్నడలో కెరీర్ మొదలు పెట్టి, తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతోంది. ఇదిలా ఉంటే రష్మిక హిందీలోనూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. గుడ్‌బై’, ‘మిషన్ మజ్ను’ యానిమల్ వంటి మూవీస్‌తో హిందీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
ఇటీవల ఈ బ్యూటీ విక్కీ కౌశల్‌తో ‘చావా’ సినిమా చేసింది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ పాత్రను పోషించాడు. శంభాజీ భార్య మహారాణి యేసుబాయి పాత్రలో నటి రష్మిక కనిపించనుంది.
ఈ సినిమాకు సంబంధించి రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సౌత్ ఇండస్ట్రీని నుంచి వచ్చి మహారాణి యేసుబాయి పాత్రలో నటించాను. ఇది నా జీవితంలో నేను చేసిన ప్రత్యేక పాత్ర. ఈ సినిమా తర్వాత రిటైర్ కావాలని అనిపించిందని దర్శకుడు లక్ష్మణ్‌తో చెప్పానని చెప్పుకొచ్చింది. అయితే ఇంత స్వింగ్‌లో ఉన్న రష్మిక ఇప్పట్లో సినిమాలకు బ్రేక్ ఇచ్చే అవకాశాలు లేవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
రష్మిక చేసిన కామెంట్స్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే రష్మిక త్వరలోనే వివాహం చేసుకోబోతందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రష్మిక చేసిన కామెంట్స్‌కి బలం చేకూర్చినట్లైంది. ఇటీవల రష్మిక కాలుకు గాయమైంది. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న సమయంలో రష్మిక కాలుకి గాయమైంది. అందుకే తాజాగా ఎయిర్ పోర్టులో వీల్ చెయిర్‌పై కనిపించింది. ఆ ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.