priya bhavani shankar: కుర్రాళ్ల హృదయాలు ఢమాల్‌.. పెళ్లి పీటలెక్కుతోన్న అందాల తార

తాజాగా వచ్చిన భారతీయుడు 2 సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిందీ చిన్నది.

Update: 2024-08-08 15:00 GMT

priya bhavani shankar: కుర్రాళ్ల హృదయాలు ఢమాల్‌.. పెళ్లి పీటలెక్కుతోన్న అందాల తార 

అందం, అభినయం ఉన్న హీరోయిన్స్‌లో ప్రియా భవానీ శంకర్‌ ఒకరు. న్యూస్‌ యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన హీరోయిన్‌గా ఎదిగిందీ బ్యూటీ. తనదైన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది. కొన్ని సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచమైంది. తన అందంలో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది చిన్నది.

తాజాగా వచ్చిన భారతీయుడు 2 సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిందీ చిన్నది. ఇదిలా ఉంటే సంతోష్ శోభన్ తో కలిసి కల్యాణం కమనీయం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా ఆట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రియా కుర్రాళ్ల హృదయాలు బద్దలయ్యే విషయాన్ని తెలిపింది. తన బ్యాచిలర్‌ జీవితానికి బై బై చెబుతూ ప్రియుడితో కలిసి పెళ్లి పీట లెక్కనున్నట్లు ప్రకటించింది. పదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఆ ప్రేమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోబుతున్నట్లు చెప్పుకొచ్చింది. వచ్చే ఏడాది వివాహం ఉండనున్నట్లు అభిమానులకు చెప్పేంది. ఇందుకు సంబంధించి ప్రియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

వివాహానికి సంబంధించి మాట్లాడుతూ.. ‘నేను సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందునుంచే రాజ్‌తో ప్రేమలో ఉన్నాను. అయితే మేమిద్దరం బ్రేకప్ చెప్పుకున్నామంటూ ఇప్పటికే ఎన్నోసార్లు పుకార్లు షికార్లు చేశాయి. మేం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటివరకూ నేను చాలామంది నటులతో కలిసి పని చేశాను. వారితో ఉన్న చనువు, స్నేహం కారణంగా పుట్టిన రోజు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో వారికి విషెస్ చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేదాన్ని. అంతే.. అలా పోస్ట్ పెట్టడమే ఆలస్యం.. హీరోలతో నాకు రిలేషన్ కట్టబెట్టేవారు. అదృష్టం కొద్దీ ఇప్పుడు నాతో నటించిన హీరోల్లో దాదాపు అందరికీ పెళ్లయిపోయంది’ అంటూ రాసుకొచ్చింది.

ప్రియా చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. దీంతో గత కొన్ని రోజులుగా ఆమపై వస్తున్న పుకార్లకు చెక్‌ పెట్టడంతో పాటు, తన వివాహానికి సంబంధించి అధికారిక ప్రకటన చేసేసింది. ఇదిలా ఉంటే ప్రియా ప్రస్తుతం ‘డెమోంటే కాలనీ 2’ సినిమాలో నటిస్తోంది.

Tags:    

Similar News