కాబోయే భర్తతో నిహారిక.. సోషల్ మీడియాలో పిక్ వైరల్!
Niharika With Her Fiancé : మెగా ప్రిన్సెస్ నిహారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.. జొన్నలగడ్డ వెంకటచైతన్యతో నిహారిక వివాహం జరగనుంది.. ఇప్పటికే ఆగస్టు 13న వీరికి నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే..
niharika with her Fiancé in gym
Niharika With Her Fiancé : మెగా ప్రిన్సెస్ నిహారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.. జొన్నలగడ్డ వెంకటచైతన్యతో నిహారిక వివాహం జరగనుంది.. ఇప్పటికే ఆగస్టు 13న వీరికి నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే.. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. వచ్చే ఏడాది ఆరంభంలో వీరి వివాహం జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా వీరిద్దరూ ఒక జిమ్ లో వర్కౌట్స్ చేసి బయటకు వస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలో వీరిద్దరు లవ్ బడ్స్ లాగా కనిపిస్తున్నారు. త్వరలో వీరి పెళ్లి చేసుకోనున్న నేపధ్యంలో వీరు ఎక్కడ కనిపించిన అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఇక నిహారికకి కాబోయే భర్త వెంకట చైతన్య జొన్నలగడ్డ ఎవరో కాదు.. గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్ కుమారుడు.. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన చైతన్య బిట్స్ పిలానీలో మాస్టర్స్ ఇన్ మ్యాథమ్యాటిక్స్ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎమ్‌బీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఎంఎన్‌సి కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు.
ఇక అటు మెగా కాంపౌండ్ నుండి తొలి హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిహారిక.. ఒక మనసు,హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం.