Mega Princess Niharika konidela : మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి పనులు షురూ!

Mega Princess Niharika konidela : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది.. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి త్వరలో కానుంది

Krishna
Published on: 18 Aug 2020 11:18 AM IST
Mega Princess Niharika konidela :  మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి పనులు షురూ!
X
Mega Princess Niharika konidela Wedding Works Started

Mega Princess Niharika konidela : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది.. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి త్వరలో కానుంది.. ఆగస్టు 13న నిహారిక నిహారిక నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఈ వేడుక‌కి నిహారిక బాబాయ్ పవర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్ త‌ప్ప మెగా ఫ్యామిలీ కుటుంబ స‌భ్యులు అంద‌రు హాజ‌ర‌య్యారు. ఇక నిశ్చితార్ధ వేడుక‌లో నిహారిక, చైతన్య ఉంగరాలు మార్చుకోవ‌డం, కుటుంబ స‌భ్యులు తాంబూలాలు మార్చుకోవ‌డంతో వివాహానికి ముందు అత్యంత ముఖ్యమైన ఘట్టం పూర్తైయింది.

ఇక తాజాగా శ్రావ‌ణ సోమ‌వారం సందర్భంగా ప‌సుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో మెగా ఫ్యామిలీకి సంబంధించిన మహిళలు అందరూ హాజరయ్యారు. అందరూ కలిసి పసుపు దంచుతున్న ఫొటోలను వీడియో రూపకంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు నిహారిక. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇది చూస్తుంటే ఈ నెలలోనే నిహారిక పెళ్లి ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలో తేదిని కూడా ఆఫీషియల్ గా అనౌన్సు చేస్తారని సమాచారం..



ఇక నిహారికకి కాబోయే భర్త చైతన్య జొన్నలగడ్డ ఎవరో కాదు.. గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌ కుమారుడు తన్య ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఎంఎన్‌సి కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. వచ్చే ఏడాది నిహారిక వివాహం జరగనుందని సమాచారం.. ఇక అటు మెగా కాంపౌండ్ నుండి తొలి హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిహారిక‌.. ఒక మ‌న‌సు,హ్యాపీ వెడ్డింగ్‌, సూర్యకాంతం, సైరా వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని సమాచారం.

Krishna

Krishna

Next Story