Megha Akash: ఇలా సడెన్‌గా చెప్పేసిందేంటి.. వైరల్‌ అవుతోన్న మేఘా ఆకాశ్‌ ఫొటోలు..!

Megha Akash: హీరోయిన్లకు సంబంధించి రూమర్లు రావడం సర్వసాధారణం. మరీ ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.

Update: 2024-08-23 10:28 GMT

Megha Akash: ఇలా సడెన్‌గా చెప్పేసిందేంటి.. వైరల్‌ అవుతోన్న మేఘా ఆకాశ్‌ ఫొటోలు..

Megha Akash: హీరోయిన్లకు సంబంధించి రూమర్లు రావడం సర్వసాధారణం. మరీ ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. పలానా హీరోయిన్‌ పలానా వ్యక్తితో ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందని వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా అందాల తార మేఘా ఆకాశ్‌కు సంబంధించి కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. ఈ బ్యూటీ ఓ వ్యక్తితో ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలో ఈ వార్తలపై మేఘా స్పందించలేదు.

కానీ తాజాగా సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేస్తూ.. ఈ వార్తలన్నీ నిజమే అని చెప్పేసింది. ప్రియుడితో జరిగిన నిశ్చితార్థం ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేసింది. “నా కోరిక నిజమైంది… ప్రేమ, నవ్వులు, ఆనందం అన్నీ ఇక నీతోనే.. నా జీవితానికి ప్రేమను పరిచయం చేసిన వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది” అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ఆగస్ట్ 22న ఈ వేడుక జరిగినట్లుగా మేఘా తెలిపింది. ఇక మేఘాకు కాబోయే భర్త పేరు సాయి విష్ణు అని తెలుస్తోంది.

సాయికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ఈ జంటకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరికి శుభాకాంక్షలు చెబుతూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఇంత సడన్‌గా ఎంగేజ్‌మెంట్ విషయాన్ని వెల్లడించడంతో కుర్రకారు తమ హార్ట్ బ్రేక్‌ అయ్యాయి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే నితిన్‌ హీరోగా వచ్చిన లై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార మేఘా ఆకాష్‌. తొలి సినిమాతోనే తనదైన అందం, నటనతో మెస్మరైజ్‌ చేసిన ఈ చిన్నది. అయితే తెలుగులో ఆశించిన స్థాయిలో విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. కానీ తమిళంలో మాత్రం వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మేఘా ఆకాష్‌ ఇలా పెళ్లి ప్రకటన చేసి అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది.


Tags:    

Similar News