షూటింగ్‌కి వెళ్లి వరదల్లో చిక్కుకున్న స్టార్ హీరోయిన్..

హిమాచల్‌ప్రదేశ్‌‌లో ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దిని ప్రభావంతో కొండ చరియలు విరిగిపడడం, వరదనీరు ప్రవహిస్తుండడంతో రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడ స్తంభించిపోయింది.

Update: 2019-08-20 13:22 GMT

హిమాచల్‌ప్రదేశ్‌‌లో ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దిని ప్రభావంతో కొండ చరియలు విరిగిపడడం, వరదనీరు ప్రవహిస్తుండడంతో రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. దీంతో కొండప్రాంతాల్లో చాలా మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ కోసం వెళ్లిన మలయాళం మూవీ 'కయ్యాటమ్' యూనిట్ కూడా లాహోల్ స్పితిలోయలోని ఛత్రులో చిక్కుకుపోయింది. మలయాళ నటి హీరోయిన్ మంజు వారియర్ తో పాటు మూవీ డైరెక్టర్ సనాల్ కుమార్ శశిధరన్‌ సహా 30 మంది చిక్కుకున్నారు.

దీంతో ఈ విషయాన్ని తన సోదరుడు మధుకు కాల్ చేసి వివరించింది. దీంతో ఆయన ఈ విషయాన్ని సీఎం జైరామ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు.ఆయన ఆదేశాల ప్రకారం మంజు వారియర్, చిత్రబృందాన్ని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ప్రస్తుతం అక్కడ టెలిఫోన్, సెల్ ఫోన్ లైన్స్ ఏం పని చేయడం లేదని.. సోమవారం రాత్రి తన సోదరి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నామని చెప్పినట్లు మధు వెల్లడించాడు. 

Tags:    

Similar News