Mallika Sherawat: 'నడుము మీద చపాతీలు వేస్తానన్నారు'.. దర్శకుడిపై మల్లికా సంచలన కామెంట్స్..
Mallika Sherawat: మల్లికా షెరావత్.. దేశవ్యాప్తంగా ఈ హీరోయిన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిచయం చేయలేదు.
Mallika Sherawat
Mallika Sherawat: మల్లికా షెరావత్.. దేశవ్యాప్తంగా ఈ హీరోయిన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిచయం చేయలేదు. గ్లామర్ పాత్రలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ బ్యూటీ. హిందీతో పాలు పలు సౌత్ మూవీస్‌లోనూ నటించి మెప్పించిందీ చిన్నది. ఇండస్ట్రీలో భారీ మూవీస్‌లో నటించిన ఈ చిన్నది 2012 తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది.
అయితే తాజాగా ‘విక్కీ విద్యా క వో వాలా వీడియో’ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మల్లికా పలు సెన్సేషన్ కామెంట్స్ చేసింది. దక్షిణాది దర్శకుడి నుంచి ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా మల్లికా మాట్లాడుతూ.. 'ఒక దక్షిణాది దర్శకుడు నా దగ్గరికి వచ్చి హాట్ ఐటెం సాంగ్ ఉందని చెప్పారు. ఇది ఎలా ఉండాలంటే చూసే ప్రేక్షకులకు మీరెంత హాట్ అనేది అర్థమవ్వాలన్నారు. నేను కూడా ఓకే చెప్పి దానికోసం మీరు ఎలా చూపిస్తున్నారు అని అడిగాను. ఇందుకోసం నా నడుము మీద చపాతీలు వేడి చేస్తానన్నారు. నేను వెంటనే ఆశ్చర్యపోయి ఆ పాట చేయను అని ముఖం మీదే చెప్పేశాను ' అని చెప్పుకొచ్చింది.
అయితే వినడానికి మాత్రం ఆ దర్శకుడు చెప్పిన మాట ఫన్నీగా అనింపిచందిందని మల్లికా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ అలాంటి పరిస్థితి రాలేదని మల్లికా చెప్పుకొచ్చేసింది. అయితే ఇంతకీ ఆ దక్షిణాది దర్శకుడు ఎవరన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. దీంతో ఇంతకీ ఆ దర్శకుడు ఎవరబ్బా అని సినీ లవర్స్ చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం మల్లికా చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.