చిరంజీవికి వచ్చిన యాక్టింగ్ పవన్‌కు వచ్చా..ఆ ఒక్క విషయం తర్వాతే పవన్‌ అభిమానిగా మారా?

కాలేజ్‌ రోజుల్లో నేను చదువుకునేప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఫ్యా్న్‌ని. నా ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ అభిమానులు. చిరంజీవికి వచ్చినంత నటన వచ్చా?, డ్యాన్స్ వచ్చా, అని కామెంట్స్ చేసేదాన్ని అంటూ చెప్పారు.

Update: 2020-03-07 06:23 GMT
madhavi latha , pawan kalyan File Photo

టాలీవుడ్‌లో 'నచ్చావులే', 'స్నేహితుడా' వంటి సినిమాల్లో నటించి మంచి మాధవీలత గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. మాధవీలత నటించిన చివరి సినిమా 'తొలిపాట'. 2015లో ఈ సినిమా విడుదల అయింది. సినిమాల నుంచి మరో రాజకీయ రంగంవైపు ఆమె దృష్టి సారించారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో బీజేపీలో చేరారు. అయితే మాధవీలత, పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పుకుని టికెట్ సాధించిందని చాలా మంది ప్రస్తావించారట. కాగా.. వారి అభిప్రాయాలకు మాధవీలత ఫుల్‌స్టాప్ పెట్టారు.

గత ఎన్నికల్లో మాధవీలతకు బీజేపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేశారు. ఒక్కసారి గెలిపిచాలని సేవ చేస్తానని ప్రచారం చేసారు. ప్రచారంలో మంచి స్పందన లభించింది. ఎన్నికల్లో గెలుస్తానని మాధవీలత ధీమా వ్యక్తం చేసారు. అక్కడ టీడీపీ, వైసీపీ బలంగా ఉండటంతో నియోజకవర్గంలో ఓడిపోయారు. అంతకుముందు రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్ తరపున హైదరాబాద్‌లో నిరసన దీక్షలు చేశారు.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. రాజకీయాల్లోకి వయసైపోయినవారే వస్తారని అనుకుంటారు. పాతకాలం పద్దతని అన్నారు. కానీ, ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలి కోరుకుంటున్నారు. యువతలో కొత్త ఆలోచనలు ఉంటాయి అని తెలిపారు. అందుకే రాజకీయాల్లోకి వచ్చానని స్పష‌్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోతానని ముందే ఊహించాను అని అన్నారు.

కాలేజ్‌ రోజుల్లో నేను చదువుకునేప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఫ్యా్న్‌ని. నా ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ అభిమానులు. పవన్‌పై ఉన్న పిచ్చిని చూసి నేను ఏం పవనే, ఆయనకు చిరంజీవికి వచ్చినంత నటన వచ్చా?, డ్యాన్స్ వచ్చా, అని కామెంట్స్ చేసేదాన్ని అంటూ చెప్పారు. ఓసారి పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చూశాను. ఆయనకు సమాజంపై అవగాహన పట్ల ఆశ్చర్యం వేసింది. ఆ ఇంటర్వ్యూ తర్వాతే పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ అయిపోయాను. నా గదిలో పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉండేవి, మా అమ్మ పవన్ ఫోటోలు ఎందుకు దేవుడి ఫోటోలు పెట్టుకోవచ్చుగా అని చెప్పేవారు అని మాథవీలత చెప్పారు.

నేను పవన్ కళ్యాణ్ అభిమానిని జనసేనలో ఎందుకు చేరలేదని సన్నిహితులు అడిగారు. బీజేపీలో చేరింది పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకునే చాలా మంది అన్నారు. కామన్ సెన్స్ ఉన్నవారు అలా మాట్లాడరు. బీజేపీలో నేను చేరే సమయంలో జనసేనకు బీజేపీ మధ్య ఎలాంటి పొత్తు లేదు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానిని సీటు ఇవ్వండి అంటే ఇస్తారా? అని అన్నారు. బీజేపీలో చేరినప్పుడు పవన్ సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడ్డాను. ఇప్పుడు బీజేపీ జనసేన కలిసే ఉన్నాయి. నేను బీజేపీలో ఉన్నందుకు జనసైనికులు హ్యాపీగా ఫీలవ్వాలి అని అన్నారు.

అయితే మాధవీలత బీజేపీలో చేరితే సన్నిహితులు ఆ పార్టీలో ఎందుకు చేరావు ప్రశ్నించేవారట. ప్రాంతీయ పార్టీల్లో భవిష్యత్తు భాగుటుందని చెప్పేవారట. వీటి గురించి మాధవి స్పందిస్తూ.. బీజేపీ అనేది జాతీయ పార్టీ. భవిష‌్యత్తులో కెరీర్‌కు కూడా ఉపయోగపడుతుందని చేరాను. డబ్బు, పలుకుబడి కలిగిన వారే రాజకీయాల్లోకి వస్తారని చాలా మంది అభిప్రాయం. డబ్బు కాదు లక్ కూడా ఉండాలి. బీజేపీలో చేరాను నాకు పార్టీ నుంచి ఎలాంటి ఫండ్స్ ఇవ్వదు. నా సొంత డబ్బుతోనే పార్టీ కార్యక్రమాలు చూసుకోవాలి, అనుచరులకు డబ్బులు ఇచ్చుకోవాలి. రాజకీయాల్లో డబ్బు ఉండాల్సిందే అని చెప్పారు.


  

Tags:    

Similar News