Actress Kavitha: సీనియర్ నటి కవిత భర్త కరోనాతో మృతి
Actress Kavitha: ప్రముఖ నటి కవిత భర్త దశరథ రాజు కోవిడ్‌తో పోరాడుతూ.. కాసేపటి క్రితమే కన్నుమూసారు.
Actress Kavitha:(File Image)
Actress Kavitha: ప్రముఖ నటి కవిత ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త దశరథ రాజు కోవిడ్‌తో పోరాడుతూ.. కాసేపటి క్రితమే కన్నుమూసారు. ఇప్పటికే కోవిడ్ కారణంగా 15 రోజుల క్రితం ఆమె కుమారుడు స్వరూప్ కన్నుమూసిన ఘటన మరవక ముందే ఆమె భర్త కరోనాతో కన్నుమూయడం విషాదకరం. కవిత కుమారుడు జూన్ 15 కోవిడ్ -19 కారణంగా ప్రాణాలను కోల్పోయాడు. తాజాగా ఆమె భర్త దశరథ రాజు కరోనాతో ప్రాణాలు ఒదిలారు. కవిత భర్త దశరథ రాజు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమెను పరామర్శిస్తున్నారు.
కవిత చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1976 లో, కవిత తమిళంలో ఓహ్ మంజు, తెలుగులో సిరి సిరి మువ్వతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టారు. కవిత కేవలం 11 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి విజయవంతంగా రాణించారు. అప్పటి తరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు, మోహన్ బాబు,మురళీ మోహన్, చంద్రమోహన్‌తో పాటు చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించారు. కరోనా మహమ్మారి ఎంతో మంది సినీ ప్రముఖులను పొట్టన పెట్టుకుంది. దీనికి అడ్డుకట్ట పడేది ఎప్పుడో అని అందరూ ఎదురుచూస్తున్నారు.