Actress:పెళ్లి కాకుండానే గర్భవతి... 40ఏళ్ల వయసులో కవలలకు తల్లి కానున్న నటి

కన్నడ నటి, నృత్యకారిణి భావన రామన్న (అసలు పేరు నందిని రామన్న) తన జీవితంలో ఓ ప్రత్యేక అధ్యాయాన్ని ప్రారంభించనున్నారు. ఆమె తాజాగా తాను కవలలకు తల్లి కాబోతున్నట్టు ప్రకటించారు.

Update: 2025-07-28 14:00 GMT

Actress:పెళ్లి కాకుండానే గర్భవతి... 40ఏళ్ల వయసులో కవలలకు తల్లి కానున్న నటి

కన్నడ నటి, నృత్యకారిణి భావన రామన్న (అసలు పేరు నందిని రామన్న) తన జీవితంలో ఓ ప్రత్యేక అధ్యాయాన్ని ప్రారంభించనున్నారు. ఆమె తాజాగా తాను కవలలకు తల్లి కాబోతున్నట్టు ప్రకటించారు. 1996లో సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన భావన, అనేక సినిమాల్లో నటించి పేరొందారు. భరతనాట్యంలో దిట్టైన ఆమె, మూడు సార్లు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు కూడా గెలుచుకున్నారు.

ప్రస్తుతం 40 ఏళ్ల వయసులో ఉన్న భావన రామన్న పెళ్లి కాకుండానే తల్లి కావాలని నిర్ణయించుకున్నారు. అయితే మొదట్లో ఆమెకు వైద్యుల నుంచి అంగీకారం లభించలేదు. కానీ చివరికి ఓ డాక్టర్ సహకారంతో IVF చికిత్స ద్వారా మొదటి ప్రయత్నంలోనే గర్భం దాల్చారు. ఇప్పుడు భావన 7 నెలల గర్భవతిగా ఉండి, కవలల బిడ్డల్ని ఆశిస్తున్నారని తెలిపారు.

ఈ విషయాన్ని స్వయంగా భావన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "ఇది నా కొత్త అధ్యాయం. నా 20, 30 వయస్సుల్లో తల్లి కావాలన్న ఆలోచన లేదు. కానీ 40 ఏళ్ల తర్వాత అది ఓ కోరికగా మారింది. నా పిల్లలకు తండ్రి లేకపోవచ్చు, కానీ వారు ప్రేమతో నిండిన ఇంట్లో పెరుగుతారు. త్వరలో ఇద్దరు చిన్న ప్రాణాలు నన్ను 'అమ్మ' అని పిలుస్తాయి. అంతే నాకు కావలసింది," అని ఆమె భావోద్వేగంతో చెప్పారు.

Tags:    

Similar News