Actor Sriram Drug Case: సినీ నటుడు శ్రీరామ్ అరెస్ట్..డ్రగ్ కేసు విచారణలో కొత్త కొత్త పేర్లు
Actor Sriram Drug Case: చెన్నై డ్రగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. తెలుగు, తమిళ హీరో శ్రీరామ్ ఇప్పుడు ఈ కేసులో విచారణను ఎదుర్కుంటున్నాడు.
Actor Sriram Drug Case: సినీ నటుడు శ్రీరామ్ అరెస్ట్..డ్రగ్ కేసు విచారణలో కొత్త కొత్త పేర్లు
Actor Sriram Drug Case: చెన్నై డ్రగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. తెలుగు, తమిళ హీరో శ్రీరామ్ ఇప్పుడు ఈ కేసులో విచారణను ఎదుర్కుంటున్నాడు. ఈ కేసులో ఇతన పాత్ర ఎంత? అతనికున్న లింక్ ఏంటి? అన్న కోణంలో పోలీసులు శ్రీరామ్‌ని విచారణ చేస్తున్నారు.
కొన్నాళ్ల క్రితం బారులో జరిగిన గొడవకు కారణంగా చెన్నై సిటీ నున్నంబాగం ఏరియాలో ఏఐడిఎంకే పార్టీకి చెందిన ఐటీ వింగ్ సభ్యులు ప్రసాద్ అరెస్ట్ అయ్యాడు. ఈ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేయడం, వారితో డ్రగ్స్ ను సరఫరా చేయించారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు, ఈ ప్రసాద్‌తో లింక్స్ ఉన్న వారందరినీ పోలీసలు అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా టాలీవుడ్ హీరో శ్రీరామ్‌ని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో నిందితుడు ప్రసాద్ నుంచి హీరో శ్రీరాంకు డ్రగ్స్ సరఫరా అయినట్లు తెలిసింది.
తిరుపతికి చెందిన శ్రీకాంత్ ఆ తర్వాత సినిమాలకోసం చెన్నై వెళ్లి తన పేరు శ్రీరామ్ గా మార్చుకున్నాడు. చాలా తెలుగు,తమిళ సినిమాల్లో నటించాడు. అయితే తాజాగా అతనికి డ్రగ్స్ కేసులో లింక్ ఉందన్న కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో శ్రీరామ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు కొన్ని గంటల పాటు శ్రీరామ్‌ని నార్కోటిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. అయితే విచారణలో ఎలాంటి విషయాలు ఇంకా బయటకు రాలేదు.