Actor kick Shyam Arrested: ప్రముఖ నటుడు కిక్ శ్యామ్ అరెస్టు

Update: 2020-07-28 07:52 GMT

Actor kick Shyam Arrested: ప్రముఖ సినీనటుడు కిక్‌ శ్యామ్‌ను మంగళవారం చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని కోడంబాక్కం ప్రాంతంలో శ్యామ్ ఓ ఫోక‌ర్ క్ల‌బ్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ల‌బ్‌లో శ్యామ్ గ్యాంబ్లింగ్ చేస్తున్నార‌ని పోలీసులు గుర్తించ‌డంతో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎలాంటి అనుమ‌తులు లేకుండా శ్యామ్ పేకాట‌, బెట్టింగులు నిర్వ‌హిస్తుండ‌టంతో శ్యామ్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. దీంతో పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. తెలుగు, తమళ సినిమాల్లో నటించిన శ్యామ్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కిక్, ఊసరవెల్లి ,రేసుగుర్రం, కిక్- 2 వంటి చిత్రాలలో నటించాడు శ్యామ్. కిక్‌లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో ఆకట్టుకుని టాలీవుడ్‌లో కిక్‌ శ్యామ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమళ సినిమాల్లో న‌టించిన శ్యామ్ మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు.

Tags:    

Similar News