Chennai Traffic Police Shock To Rajinikanth: సూపర్ స్టార్ రజినీ ఆ '100' ఇంకా కట్టలేదు..

Raj
By Raj
Published on: 26 July 2020 3:34 PM IST
Chennai Traffic Police Shock To Rajinikanth: సూపర్ స్టార్ రజినీ ఆ 100 ఇంకా కట్టలేదు..
X

Chennai Traffic Police Shock To Rajinikanth: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కు చెన్నై ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనకు జరిమానా విధించారు. ఇటీవల చెన్నైలో కారులో ప్రయాణించిన రజిని సీటు బెల్టు ధరించలేదు. ఇది ట్రాఫిక్ పోలీసుల కన్నుకు చిక్కింది. దీంతో రజినీకాంత్ కు 100 రూపాయలు జరిమానా విధించారు. అయితే ఈ జరిమానా ఇంకా పెండింగ్ లోనే ఉంది. జూన్ 26 న ఆయనకు రూ .100 జరిమానా విధించారు. జూలై 20 న రజనీకాంత్ సరికొత్త లంబోర్ఘిని కారు నడుపుతున్న చిత్రాలు వైరల్ అయ్యాయి. ఆ తరువాత, సూపర్ స్టార్ తన కుమార్తె సౌందర్య మరియు ఆమె కుటుంబంతో కలిసి, కొత్త కారు కొన్న సందర్బంగా దానితో ఉన్న చిత్రాలను కూడా పంచుకున్నారు.

జూలై 20 న రజనీకాంత్ కేలంబక్కంలోని తన ఫామ్ హౌస్‌కు వెళ్లారు. అయితే ప్రస్తుతం కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రజనీకాంత్ వేరే జిల్లాకు వెళ్లడానికి ఇ-పాస్ పొందారా లేదా అని సోషల్ మీడియాలో ప్రజలు, నెటిజెన్ల ప్రశ్నించారు. కాగా రజిని తన వ్య‌వ‌సాయ క్షేత్రంలో గత కొద్ది రోజులుగా ఉంటున్న కూతురు సౌంద‌ర్య‌, అల్లుడు విశాగ‌న్ వానంగ‌మూడి, మ‌న‌వ‌డు వేద్ కృష్ణ‌తో క‌లిసి అక్కడే ఉంటున్నారు. వారితో కొద్ది రోజులు ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మ‌రోవైపు ఫాంహౌజ్ పరిసరాల్లో స‌ర‌దాగా వాకింగ్ చేస్తూ రజిని తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.

Raj

Raj

Next Story