Potti Veeraiah: సినీ నటుడు పొట్టి వీరయ్య కన్నుమూత
Potti Veeraiah: సినీ నటుడు పొట్టి వీరయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చేరి గుండెపోటుతో మరణించారు.
పొట్టి వీరయ్య (ఫొటో ట్విట్టర్)
Potti Veeraiah: ప్రముఖ సినీ నటుడు పొట్టి వీరయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చేరిన పొట్టి వీరయ్య గుండెపోటుతో మరణించారు. నల్గొండ జిల్లాకు చెందిన వీరయ్య.. అగ్గివీరుడు సినిమాతో తెరంగేట్రం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు నాలుగు వందల సినిమాల్లో నటించారు.
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్‌లో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో పొట్టి వీరయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు.