ఇవాళ సాయంత్రం ఆచార్య నుంచి మరో సాంగ్ రిలీజ్‌.. ప్రోమోలో ఇరగదీసిన చిరు, చెర్రీ...

Acharya Song: ఫుల్‌ సాంగ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌...

Update: 2022-04-18 03:28 GMT

ఇవాళ సాయంత్రం ఆచార్య నుంచి మరో సాంగ్ రిలీజ్‌.. ప్రోమోలో ఇరగదీసిన చిరు, చెర్రీ...

Acharya Song: మెగాస్టార్‌ చిరంజీవి(Megastar Chiranjeevi), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో వస్తున్న ఆచార్య(Acharya) మూవీ నుంచి భలే భలే బంజారా(Bhale Bhale Banjara) అనే సాంగ్‌ను చిత్రయూనిట్‌ ఇవాళ రిలీజ్‌ చేయనుంది. తాజాగా.. ఈ పాటకు సంబంధించిన ప్రోమో వీడియోను పంచుకుంది. పూర్తి సాంగ్‌ ఇవాళ సాయంత్రం 4గంటల 5నిమిషాలకు రిలీజ్‌ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రోమోలో చిరు, చెర్రీ స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో.. పూర్తి సాంగ్‌ కోసం ఫ్యాన్స్‌ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈనెల 29న ఆచార్య సినిమా రిలీజ్‌ కానుంది. ఈ నెల 23న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనుంది చిత్ర యూనిట్‌. ఏపీ సీఎం జగన్‌(AP CM Jagan)  ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతారని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌.. చక్కర్లు కొడుతోంది. అయితే.. ముందుగా ఈ వేడుకను విజయవాడ(Vijayawada) లో పెట్టాలని భావించారు. కొన్ని అనివార్య కారణాలతో ఈవెంట్‌ను హైదరాబాద్‌కు షిప్ట్‌ చేసినట్టు సమాచారం.

Tags:    

Similar News