Tollywood: క్రేజీ కాంబినేషన్‌.. ఫీల్‌ గుడ్‌ మూవీ కావడం ఖాయం

శేఖర్‌కమ్మలు దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నారని ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్‌ అవుతోంది.

Update: 2024-09-15 03:21 GMT

నేచురల్‌ స్టార్‌ నాని.. ఈ పేరు వినగానే ఫీల్‌ గుడ్‌ మూవీస్‌ గుర్తొస్తాయి. ఓవైపు యాక్షన్‌ చిత్రాల్లో నటించినా నాని అంటే ఒక అలా మొదలైంది, ఒక అష్టా చమ్మ లాంటి సినిమాలు గుర్తురావడం ఖాయం. ఇక టాలీవుడ్‌లో ఫీల్‌ గుడ్‌ మూవీస్‌కు పెట్టింది పేరు దర్శకుడు శేఖర్‌కమ్ముల. ఇలాంటి ఇద్దరి కాంబినేషన్‌లో మూవీ వస్తే ఎలా ఉంటుంది.? ఊహించుకోవడానికి సూపర్‌గా ఉంది కదూ! అయితే త్వరలోనే ఇది నిజం కానుందని తెలుస్తోంది.

శేఖర్‌కమ్మలు దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నారని ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్‌ అవుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాని కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తునట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవిని తీసుకునే ఆలోచనలో శేఖర్‌ కమ్ముల ఉన్నారని టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే నాని, సాయి పల్లవి కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో కూడా సాయి పల్లవి రెండు సినిమాలు చేసింది.

దీంతో ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో సినిమా అనగానే అందరి దృష్టి పడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం శేఖర్‌కమ్మలు కుబేర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ధనుష్‌ హీరోగా, నాగార్జున ప్రత్యేకపాత్రలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. కుబేర మధ్యలోనే నాని సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News