Prabhas: ప్రభాస్ ఫౌజీలో మరో టాలీవుడ్ హీరో.. ఇంతకా హీరో ఎవరంటే.?
Prabhas: బాహుబలి తర్వాత ప్రభాస్ స్థాయి ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ నుంచి ఏ సినిమా వచ్చినా అది ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటోంది. అందుకే మేకర్స్ సైతం ప్రభాస్‌తో భారీ సినిమాలనే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో ఉన్న చిత్రాల్లో ఫౌజీ ఒకటి.

హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. కథ స్వాతంత్య్ర సమయానికి ముందు కాలంలో సాగుతుందట. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్నాడన్న వార్తలు వచ్చాయి. హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే.
అయతే తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరో నటించనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ రవిచంద్రన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఇప్పటికే ఆయన షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మూడింటికి పైగా పాటలకు ట్యూన్స్ రెడీ అయినట్లు సమాచారం.
మరోవైపు ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హారర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను కూడా 2025లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
కాగా ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం స్పిరిట్ కూడా ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. సందీప్ వంగ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నాడు. హీరోయిన్‌గా బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రిని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.