30 రోజుల్లో ప్రేమించడం ఎలా?.. రిలీజ్ డేట్ ఫిక్స్
బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మున్నా దర్శకత్వం వహిస్తున్నారు.
బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. టైటిట్ ప్రకటించిన అప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు విశేష స్పందన వచ్చింది. దీంతో ఇందుకు తగ్గట్టుగా సినిమా యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్లు చేసింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బీజీగా ఉంది. ముఖ్యంగా 'నీలి నీలి ఆకాశం' పాట యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటి వరకు ఈ పాటను 60 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. టాలీవుడ్ సూపర్‌స్టార్ ఈ సాంగ్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా, ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్న ప్రదీప్ ఫాలోవర్స్‌కు సినిమా యూనిట్ తీపి కబురు అందించింది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. అంతేకాకుండా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి పోస్టర్స్‌ను కూడా రీలీజ్ చేశారు. ఇక మార్చి 25న నాని, సుధీర్ల 'వి', రాజ్ తరుణ్ 'ఓరేయ్ బుజ్జిగా',తో పాటు 'అమృతరామమ్' చిత్రాలు విడుదల కానున్నాయి. వాటికి పోటీగా అదే రోజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమా రాబోతోంది.