Movie: ప్రతీ క్షణం భయానకం.. యూట్యూబ్‌లో ఉన్న రొమాంటిక్ థ్రిల్లర్‌ను చూశారా.?
1920 The Evil Returns: 1920 The Evil Returns: హారర్ మూవీస్‌ను వీక్షించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ జానర్‌కు చెందిన మూవీస్‌ను ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు.
Movie: ప్రతీ క్షణం భయానకం.. యూట్యూబ్‌లో ఉన్న రొమాంటిక్ థ్రిల్లర్‌ను చూశారా.?
1920 The Evil Returns: హారర్ మూవీస్‌ను వీక్షించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ జానర్‌కు చెందిన మూవీస్‌ను ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు. అలాంటి ఆ సక్తికరమైన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఒక ప్రేమకథ అర్థాంతరంగా ముగిసి, దానిపై దుష్టశక్తి ప్రభావం చూపితే? ఆ ప్రేమ జీవితాంతం భయానక గాథగా మారితే? ఇలాంటి ఓ రోమాంటిక్ హారర్ థ్రిల్లరే ‘1920: ఈవిల్ రిటర్న్స్’. భూషణ్ పటేల్ దర్శకత్వం వహించగా, కథను విక్రమ్ భట్ అందించాడు. ఈ చిత్రంలో అఫ్తాబ్ శివదాసాని తన కెరీర్‌లో అత్యుత్తమ నటన కనబరిచాడు.
కథేంటంటే.?
కథా నేపథ్యం 1920 నాటిది. జైదేవ్ వర్మ (అఫ్తాబ్ శివదాసాని) అనే కవి తన లవర్ స్మృతిని కోల్పోయిన బాధతో ఒంటరిగా జీవిస్తుంటాడు. ఆమె మరణవార్త విన్న తర్వాత జైదేవ్ జీవితంలో అంధకారం అలుముకుంటుంది. అదే సమయంలో ఒకరోజు సరస్సు దగ్గర గుర్తు తెలియని అమ్మాయి (టియా బాజ్‌పాయ్) అతని జీవితంలో ప్రవేశిస్తుంది.
ఆ అమ్మాయి ఎవరు? ఆమె గతం ఏమిటి?
ఆమెకు తన పేరు కూడా గుర్తుండదు. కానీ, జైదేవ్ కవితలు మాత్రం ఆమెకు తెలుసు. శవాల కాపరి ఆమెపై దుష్టశక్తి ప్రభావం ఉందని చెబుతాడు. ఈ సందర్భంగా అనేక భయానక అనుభవాలు ప్రారంభమవుతాయి. గదిలో దెయ్యాలు కనిపించడం, శరీరంపై మేకులు రావడం వంటి అంశాలు భయానికి గురి చేస్తాయి.
నిజంగా ఆమె ఎవరు?
జైదేవ్ ఆమెను ఇంట్లో ఉంచుకుంటూ, “సంగీత” అనే పేరు పెడతాడు. కానీ ఆమెను దెయ్యం ఆవహించిన సమయంలో, విషయం మరింత తీవ్రతకు చేరుతుంది. చివరికి, సంగీత ఎవరో కాదు... జైదేవ్ ప్రియురాలైన స్మృతే అని తెలుస్తుంది. ఆమెకు గతంలో జరిగిన మానసిక వేదన, అమర్ అనే వ్యక్తి ఆటలన్నీ బయటపడతాయి.
అమర్ ఆత్మ పగతో విరుచుకుపడితే…
జైదేవ్ స్నేహితుడు అమర్, అతని కవితా ప్రతిభపై అసూయతో పాటు, స్మృతిపై కోరికతో, ఆమెను మోసం చేసి చిత్రహింసలు పెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ తనను మోసం చేశాడన్న విషయాన్ని గ్రహించిన స్మృతి, అమర్‌ను చంపేస్తుంది. ఆ తర్వాత అతని ఆత్మ ఆమె శరీరంలోకి ప్రవేశిస్తుంది.
హారర్ లోకేషన్, ఇంటెన్స్ యాక్టింగ్
ఈ మూవీని స్వీడన్‌లో షూట్ చేశారు. ఆ సమయంలో విపరీతమైన పొగమంచు ఉండడంతో సన్నివేశాలను మరింత ఇంటెన్సివ్‌గా మార్చాయి. టియా బాజ్‌పాయ్ నటనలో ఉన్న ఇంటెన్సిటీ, ఆమెని ఆవహించిన దెయ్యంగా నటించిన దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ‘1920: ఈవిల్ రిటర్న్స్’ ఈ ఫ్రాంచైజీలో భాగమే అయినా, ఇది ముందటి సినిమాకి కొనసాగింపుగా ఉండదు.
కేవలం రూ.9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద రూ.28 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. అంతేకాదు, దీని డిజిటల్ ప్రమోషన్ మోడల్ హార్వర్డ్ బిజినెస్ పబ్లిషింగ్‌లో కేస్ స్టడీగా గుర్తింపు పొందింది. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్‌లో ఉచితంగా వీక్షించేందుకు అందుబాటులో ఉంది. ఈ సినిమాతో ప్రేమ, ప్రతీకారం, దెయ్యం, ఆత్మ వంటి అంశాల మిశ్రమాన్ని హారర్ జానర్‌కి నూతనంగా పరిచయం చేశారు.