Super Star Krishna: ఆ సినిమా టిక్కెట్ల కోసం 12 కిలోమీటర్ల లైన్

Super Star Krishna: 1965లో "తేనె మనసులు" చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకుల మనసును గెలుచుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ...

Update: 2021-07-06 13:03 GMT

సింహాసనం మూవీ పోస్టర్ (ఫైల్ ఫోటో)

Super Star Krishna: 1965లో "తేనె మనసులు" చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకుల మనసును గెలుచుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక లెజెండ్ గా నిలిచిపోయారు. 22 ఏళ్ళ వయసుకే సినిమా హీరోగా పరిచయం అయిన కృష్ణ తన కెరీర్ లో మూడువందలకు పైగా సినిమాల్లో నటించిన కృష్ణ అందులో 25 చిత్రాల్లో ద్విపాత్రాభినయంతో, మరో 7 చిత్రాల్లో త్రిపాత్రాభినయంలో నటించి ఏ తెలుగు సినీ చరిత్రలో ఏ హీరో కూడా సాధించలేని ఘనతని సాధించారు. అప్పట్లో సంవత్సరానికి దాదాపుగా 4,5 సినిమాలు చేస్తూ రికార్డు సృష్టించారు. అయితే ఆ చిత్రాల్లో ప్రస్తుతం చెప్పుకోదగ్గ చిత్రం "సింహాసనం". ఇటీవల కాలంలో దాదాపుగా కొన్ని వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించి విడుదల చేసిన "బాహుబలి" చిత్ర తరహాలో 35 ఏళ్ళ క్రితమే సూపర్ స్టార్ సింహాసనం చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసాడు.

1986లో విడుదలైన ఈ చిత్రానికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ చిత్రాన్ని 53 రోజుల షెడ్యుల్ లో కేవలం 3 కోట్ల 50 లక్షల బడ్జెట్ తో పూర్తి చేశారు. ఈ సినిమా విజయ యాత్రకి కార్యక్రమానికి సూపర్ స్టార్ అభిమానులు దాదాపుగా 400 బస్సులలో హాజరయ్యారు. అంతేకాకుండా ఈ సినిమా టికెట్స్ కోసం థియేటర్స్ ముందు 12 కిలోమీటర్ల మేర జనాలు క్యూ కట్టడం కూడా సినిమా చరిత్రలో అదే మొదటిది చివరిది అని చెప్పొచ్చు. అప్పట్లో రాష్ట్ర రాజధానిగా ఉన్న చెన్నైలో సింహాసనం చిత్రం 100 రోజుల వేడుక కూడా జరుపుకుంది. ఇక ప్రస్తుతం ఉన్న సినీ పండితులు మాత్రం "సింహాసనం" చిత్రాన్ని 1980 లో విడుదలైన ఒక "బాహుబలి" అని వర్ణిచడం విశేషం.

Tags:    

Similar News