షారుక్ ఖాన్ - సుకుమార్ కాంబోలో 500 కోట్ల బడ్జెట్ మూవీ.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్
షారుక్ ఖాన్, సుకుమార్ కాంబినేషన్‌లో 500 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.
షారుక్ ఖాన్ - సుకుమార్ కాంబోలో 500 కోట్ల బడ్జెట్ మూవీ.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమతో భారీగా కలవబోతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీతో చేసిన ‘జవాన్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న షారుక్, ఇప్పుడు తెలుగు టాప్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి 500 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
జవాన్ తర్వాత దక్షిణాది మీద షారుక్ ప్రత్యేక దృష్టి
‘జవాన్’ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి షారుక్ ఖాన్ కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తెచ్చింది. దాంతో దక్షిణాది డైరెక్టర్లతో సినిమా చేయడం కోసం ఆయన ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ ‘సికందర్’ చిత్రంలో మురుగదాస్ దర్శకత్వంలో నటించగా, అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కానీ ఈ ఫెయిల్యూర్ కూడా సౌత్ ఇండస్ట్రీపై బాలీవుడ్ స్టార్ల ఆసక్తిని తగ్గించలేదు.
500 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమా
ఫిల్మ్‌నగర్‌లో జోరుగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, షారుక్ ఖాన్ – సుకుమార్ కాంబినేషన్ ఫైనల్ అయినట్లు తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమా పూర్తిగా పాన్ ఇండియా యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. కథ, టెక్నికల్ టీం, ఇతర నటీనటుల ఎంపిక ప్రస్తుతం జరుపుతున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.ఈ సినిమా షూటింగ్, షారుక్ నటిస్తున్న “కింగ్” సినిమా పూర్తయ్యాక ప్రారంభం కానుంది. మాస్, కమర్షియల్, పాన్ ఇండియా మిక్స్‌గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.