AdiPurush Twitter Review: 'ఆదిపురుష్' ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?
AdiPurush Twitter Review: 'ఆదిపురుష్' ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?
AdiPurush Twitter Review: ‘ఆదిపురుష్’ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?
AdiPurush Twitter Review: మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చేసింది. డార్లింగ్ ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా 9000కి పైగా స్క్రీన్స్ లో రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' హడావుడి కనిపిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ట్విట్టర్‌లో టాక్ ప్రకారం.. ఈ సినిమా ఫస్టాఫ్ బాగుందని, సెకాండ్ అదిరిందని.. మొత్తంగా సినిమా అదరహో అనిపించిందని అంటున్నారు. మరికొందరు మాత్రం యావరేజ్ అని అంటున్నారు. గ్రాఫిక్స్ బాగాలేవని అంటున్నారు. మరికొందరు సెకండాఫ్ కాస్తా డల్‌గా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా సినిమాకు మాత్రం పాజిటివ్ టాక్ ఉంది.
ఆదిపురుష్ మూవీ గుడ్ మూవీ. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, విజువల్స్, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఫైట్ సీన్స్ చూస్తే గూస్‌బంప్స్ వస్తాయి. ప్రభాస్, కృతీసనన్, సైఫ్‌అలీఖాన్ అద్భుతంగా నటించారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.