Live Updates:ఈరోజు (జూన్-23) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-06-23 00:14 GMT

ఈరోజు మంగళవారం, 23 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, విదియ (ఉ.11:58 వరకు), ఆరుద్ర నక్షత్రం (మ.01:31వరకు) సూర్యోదయం 5:43am,సూర్యాస్తమయం 6:53 pm

తాజావార్తలు

Live Updates
2020-06-23 16:40 GMT

- కరోనా బారిన పడకుండా ఉండాలి.. ఆ దిశగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నగదు లావాదేవీలు లేదా కార్డులతో చెల్లింపులు చేసినటపుడు వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయాందోళన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది.

- ముఖ్యంగా నేడు మానవ జీవితంలో భాగమైన పెట్రోల్, డీజిల్ బంకులలో ఈ ఆందోళన మరింత ఎక్కువగా ఉంటోంది.

- పెట్రోల్ బంకులకు నిత్యం వేలాది మంది వస్తూ వెళ్తూ ఉంటారు. ఇంధనం పోయించుకున్న తర్వాత నగదు లేదా కార్డు రూపంలో చెల్లింపులు చేస్తుంటారు.

- తద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

-పెట్రోల్ బంకులను సురక్షితంగా మార్చే దిశగా భారత్ పెట్రోలియం సంస్థ 'స్మార్ట్ డ్రైవ్' అనే యాప్​ను రూపొందించింది.

- దీని ద్వారా పెట్రోల్ బంకుల్లో వినియోగదారుడు టచ్ లెస్ ట్రాన్సాక్షన్స్ చేసే వీలు కలుగుతోంది.

- తద్వారా వైరస్ సామాజిక వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని భారత్ పెట్రోలియం సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

- ప్రయోగాత్మకంగా దేశంలో ఎంపిక చేసిన ఐదు నగరాల్లో ఈ యాప్​ను ప్రవేశపెట్టారు.

- విశాఖ షీలా నగర్ వద్ద ఉండే భారత్ పెట్రోలియం బంక్​లో యాప్​ను లాంచ్ చేశారు.

- ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలను, టచ్ లెస్ విధానంలో చెల్లింపులు చేయాలని నిర్వాహకులు సూచించారు. 




2020-06-23 16:12 GMT

-సబ్ డివిజన్ లో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీ యం.

- రవీందర్ నాథ్ బాబు ఆదేశాల మేరకు పేకాట,కోడి పందాలు నిర్వహించే జూధ శిబిరాలపై నిత్యం దాడులు చేస్తూ కటకటాలు లెక్కించేలా చేస్తున్నారు జిల్లా పోలీసు యంత్రాంగం.

- ఈ నేపథ్యంలో అందిన సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం పోలీస్ ప్రత్యేక బృందం ఎస్ఐ జె.వి.రమణ ఆధ్వర్యంలో మొబైల్ పార్టీ సిబ్బందితో కలసి నందిగామ శివార్లలో మామిడి తోటలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న జూద శిబిరం పై పోలీసులు మెరుపు దాడి చేయగా 3లక్షల 3వేల 770 రూపాయలు స్వాధీనం చేసుకుని,14 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు, అదేవిధంగా ఒక బిఎండబ్ల్యూ కారుతో కలిపి మొత్తం 7 కార్లు,మూడు ద్విచక్ర వాహనాలు,13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని,జూదరుల పై నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

2020-06-23 16:09 GMT

- నియోజకవర్గంలోని నూజివీడు మండలం రావిచర్ల మరియు బోరంచ గ్రామాలలో గ్రామ సచివాలయాలనీ ఆకస్మిక తనిఖీలు చేసిన మండల్ పరిషత్ అధికారి జి.రాణి, తహశీల్దార్ ఎం. సురేష్ కుమార్.

- సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో సమావేశం నిర్వహించి రెండు గ్రామాలలో కొవిడ్-19 గడపగడపకు ప్రచారం చేస్తూ సర్వే నిర్వహించారు. 




2020-06-23 16:04 GMT

- కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీసులకు, అధికారులకు మంగళవారం ఓ వింత అనుభవం ఎదురైంది.

- తనకు కరోనా టెస్టులు నిర్వహించడం లేదంటూ ఓ యువకుడు పోలిస్ స్టేషన్ కు వెళ్లి నానా రాద్ధాంతం చేసాడు.

- పోలీసులు ఆ యువకుడికి పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రికి తరలించారు.

- పూర్తి వివరాలు  

2020-06-23 16:02 GMT

- రాష్ట్రంలో నేడు అత్యధికంగా 879 కేసులు నమోదయ్యాయి.

- ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 652 కేసులు నమోదు చేసుకున్నాయి.

- ఇవ్వాళ 3 మరణాలు సంభవించాయి.

- రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 220 మంది మరణించారు.

- తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9553 కి చేరింది.

- ఇప్పటి వరకు కరోనాతో పోరాడి 4224 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 5109 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 

2020-06-23 08:24 GMT

- గడిచిన 24 గంటల్లో 407 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

- రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 20,639 శాంపిల్స్‌ని పరీక్షించగా 407 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు.

- కొవిడ్‌ కారణంగా గడిచిన 24 గంటల్లో 8 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.

- నమోదైన మొత్తం కేసులు 7858.

- ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 119.

- ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3566కి చేరింది.

- ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 4173 మంది చికిత్స పొందుతున్నారు. 

2020-06-23 05:02 GMT

తిరుపతి: ఎస్వీయూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అంశంపై అధికారులతో మంగళవారం రాష్ట్ర విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

- సోమవారం జరగాల్సిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌ మంత్రి బిజీగా ఉండటం వల్ల వాయిదా పడింది.

- మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్టు తెలిసింది.

2020-06-23 04:22 GMT

- మహిళల కోసం మరో జగన్ సర్కార్ మరో వినూత్న పథకం తీసుకొచ్చింది.

- 'వైఎస్సార్‌ కాపు నేస్తం' అనే పథకం ప్రభుత్వం ప్రారంభించనుంది.

- ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి 15వేల రూపాయల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 75 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారు.

- పూర్తి వివరాలు 

2020-06-23 04:20 GMT

- నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ కు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ

- కమ్మర్ పల్లి మండలం కొనాపూర్ సర్పంచ్ కుల బహిష్కరణ పై ఆగస్టు 14 లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

- జిల్లాలోని కొనాపూర్ గ్రామ సర్పంచ్‌ అయిన తనపై కొందరు గ్రామస్థులు కక్షపూరితంగా వ్యవహరించి కుల బహిష్కరణ చేశారని ఆరోపిస్తూ హెచ్చార్సీలో ఓ పిటిషన్‌ దాఖలైంది.

- రెండేళ్లుగా తమ కుటుంబానికి నీటి సరఫరాను బంద్‌ చేశారని, తమతో మాట్లాడినవారికి 10 వేల జరిమానా విధిస్తున్నారని ఆ సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

2020-06-23 03:41 GMT

- ఇచ్చిన నోటిఫికేషన్ల మేరకు ఇప్పటికే పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో వాయిదా వేసింది.

- ఇప్పుడీ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వం.. గ్రూప్‌-1 సర్వీసెస్‌ మెయిన్స్‌ నవంబర్‌ 2 నుంచి 13 వరకు నిర్వహించాలని నిర్ణయించింది.

- నవంబర్‌ 2న తెలుగులో పేపర్‌, 3న ఇంగ్లీషులో పేపర్‌ జరగనున్నాయి.

- 5న పేపర్‌-1, 7న పేపర్‌-2, 9న పేపర్‌-3, 11న పేపర్‌-4, 13న పేపర్‌-5 నిర్వహిస్తారు.

- గ్రూప్‌-1 సర్వీసెస్‌ మెయిన్స్‌తో పాటు ఇతర రిక్రూట్‌మెంట్లకు సంబంధించిన రివైజ్డ్‌ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.ఎ్‌స.ఆర్‌. ఆంజనేయులు సోమవారం విడుదల చేశారు.




Tags:    

Similar News