Live Updates:ఈరోజు (జూన్-16) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-16 01:26 GMT
Live Updates - Page 2
2020-06-16 06:40 GMT

అమరావతి

- గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన

- పరిపాలన వికేంద్రీకరణే అభివృద్ధికి మంత్రం

- మూడు రాజధానుల విభజనకు చట్టబద్దమైన ప్రక్రియ కొనసాగుతోంది

- పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటే మా ఉద్దేశం

- మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. నిర్మించి తీరుతాం

- ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకే అని సంకేతాలు...

2020-06-16 06:39 GMT

అమరావతి

- ఏపీలో గత ప్రభుత్వం లో జరిగిన అక్రమాలపై రంగంలోకి దిగిన ED...

- విజయవాడలో రెండోరోజు మొదలైన ఈడీ విచారvణ.

- ESI స్కాం లో అచ్చెన్నాయుడు చుట్టూ బిగిస్తున్న ED ఉచ్చు.

- అమరావతి భూముల స్కామ్ లపై ఈడీ విచారణ

- నాలుగు టీమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఈ డి బృందాలు

- సిఐడి అధికారులు నుంచి వివరాలు సేకరిస్తున్నా ఈ డి టీంలు

- అగ్రిగోల్డ్ స్కామ్ పై కూడా వివరాలు కలెక్ట్ చేస్తున్న ఈ డి

- ఈ ఎస్ ఐ స్కాం పై కూడా అరా తీస్తున్న ఈ డి

- ఏసీబీ దగ్గర నుంచి ఈ ఎస్ ఐ పై వివరాలు తీసుకుంటున్న ఈ డి...

- ఈరోజు సాయంత్రం కీలక పరిణామాలు.

2020-06-16 06:38 GMT



అమరావతి: సభలో ఎనిమిది బిల్లులు ప్రవేశ పెడుతున్నాం

- సీఆర్డీఏ బిల్లు కూడా పెట్టే ఆలోచన చేస్తున్నాం

- అచ్చెన్నాయుడు తప్పు చేయలేదని టీడీపీ నేతలు చెప్పగలరా..?

- టీడీపీ సభ్యులు నల్లచొక్కాలతో సభకు రావడం కొత్త డ్రామా

- రూ.150 కోట్ల అవినీతిలో అచ్చెన్న పాత్ర ఉందని తేలింది

 చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

2020-06-16 06:33 GMT



- విశాఖ : మున్సిపల్ కమిషనర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును అరెస్టు చేయాలన్న వైఎస్ఆర్ మహిళా విభాగం నాయకులు.

- పట్టణ పోలీసులకు పిర్యాదు.

2020-06-16 06:31 GMT

కృష్ణాజిల్లా

- గుడివాడ ధనియాల పేట కాలనీలో సైకో వీరంగం.

- రోడ్డుపై వెళుతున్న మహిళ మెడపై బ్లేడు తో గాయపరిచిన సైకో.

- గతంలో స్థానికంగా ఉన్నా పలువురిపై దాడి చేసిన సైకో.

- బాధితులు పిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు.

- గాయపడిన మహిళను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించిన స్థానికులు.

2020-06-16 06:10 GMT

నల్లచొక్కాలతో టీడీపీ నేతల నిరసన



- నల్లచొక్కాలతో అసెంబ్లీకి తెదేపా నేతలు

- అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి - నివాళులర్పించారు.

- చంద్రబాబుతో సహా పార్టీనేతలంతా నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

- ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... సొంత అజెండాను అమలు చేసుకునేందుకే అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులకే పరిమితం చేశారని ధ్వజమెత్తారు.

ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం 15రోజుల పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుని అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

ప్రజాధనం దోచుకునేందుకే సంక్షేమం పేరుతో నాటకాలు ఆడుతున్నారని నేతలు దుయ్యబట్టారు.

సభలో మాట్లాడే అవకాశం వచ్చినా రాకపోయినా సమస్యల పరిష్కారం కోసం తమవంతుపోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

మరో ఎమ్మెల్యే చిన రాజప్ప మాట్లాడుతూ... తెదేపా ప్రజాప్రతినిధుల నోరు నొక్కేందుకే కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.

పెళ్లికి హాజరైన యనమల రామకృష్ణుడు, తనపై అన్యాయంగా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

2020-06-16 05:21 GMT

విశాఖ :

* కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి ఆరు నెలల పాటు 7500 రూపాయలు ఇవ్వాలని నర్సీపట్నంలో సీఐటీయూ డిమాండ్.

* ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యములో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా.



2020-06-16 04:36 GMT

2020-2021 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సందర్భంగా సచివాలయంలోని తన ఛాంబర్ లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. 



2020-06-16 04:32 GMT

అమరావతి: సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

- గవర్నర్‌ ప్రసంగానికి కేబినెట్‌ ఆమోదం

- 2019–20 సప్లమెంటరీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

- 2020–2021 రాష్ట్రబడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్‌

- 2020–2021 వ్యవసాయ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోద ముద్ర

- ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ యాక్ట్‌ –2020 కోసం ఉద్దేశించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్.‌

- ఆక్వాకల్చర్‌లో మానిటర్, ప్రమోట్, రెగ్యులేట్‌ మరియు డెవలప్‌మెంట్‌కోసం చట్టం.

2020-06-16 04:31 GMT

వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజారులలో కాంట్రాక్టు పద్దతిపై పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కి వినతి పత్రం అందజేసిన రాష్ట్ర రైతు బజార్ ఉద్యోగుల సంఘం నేతలు.



Tags:    

Similar News