నల్లచొక్కాలతో టీడీపీ నేతల నిరసన



- నల్లచొక్కాలతో అసెంబ్లీకి తెదేపా నేతలు

- అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి - నివాళులర్పించారు.

- చంద్రబాబుతో సహా పార్టీనేతలంతా నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

- ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... సొంత అజెండాను అమలు చేసుకునేందుకే అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులకే పరిమితం చేశారని ధ్వజమెత్తారు.

ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం 15రోజుల పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుని అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

ప్రజాధనం దోచుకునేందుకే సంక్షేమం పేరుతో నాటకాలు ఆడుతున్నారని నేతలు దుయ్యబట్టారు.

సభలో మాట్లాడే అవకాశం వచ్చినా రాకపోయినా సమస్యల పరిష్కారం కోసం తమవంతుపోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

మరో ఎమ్మెల్యే చిన రాజప్ప మాట్లాడుతూ... తెదేపా ప్రజాప్రతినిధుల నోరు నొక్కేందుకే కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.

పెళ్లికి హాజరైన యనమల రామకృష్ణుడు, తనపై అన్యాయంగా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2020-06-16 06:10 GMT

Linked news