Live Updates:ఈరోజు (జూన్-05) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 05 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-06-05 00:43 GMT

ఈరోజు శుక్రవారం, 05 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పౌర్ణమి (రాత్రి 12:40వరకు), తదుపరి పాడ్యమి సూర్యోదయం 5:40 am, సూర్యాస్తమయం 6:48 pm

ఈరోజు తాజా వార్తలు 

Live Updates
2020-06-05 16:30 GMT

 ప్రపంచ ప్రజానీకంపై పగడవిప్పుతున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు. పల్లె నుంచి పట్నం వరకు ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి చెందింది. తాజాగా అండర్‌ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం, ఆయన భార్య కూడా కరోనా బారినపడ్డట్లు తెలిసింది. దావూద్‌కు పాకిస్తాన్‌లోని కరాచీ సమీపంలో గల మిలటరీ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారని సమాచారం. తొలుత ఆయన భార్య మెహజీబేన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలడంతో దావూద్‌కు నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం అందుతోంది.

దావూద్‌తో పాటు మరికొంతమంది ఆయన వ్యక్తి సిబ్బందిని కూడా క్వారెంటైన్‌కు తరలించినట్లు తెలిసింది. అయితే ఈ వార్తలను పాక్‌ మీడియా తీవ్రంగా ఖండిస్తోం‍ది. కాగా వందలాది మంది ప్రాణాలను బలిగొన్న 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్‌ ఇబ్రహీం ప్రధాని నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి బయటి ప్రపంచానికి కనిపించకుండా రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నాడు. 

2020-06-05 15:55 GMT

- ఇవాళ 143 పాజిటివ్ కేసులు

- 8 మంది కరోనా తో మృతి

- ఇప్పటి వరకు 113 మంది కరోనా తో మృతి

- తెలంగాణలో 3290 కేసులు నమోదు

- 1550 అక్టీవ్ కేసులు

- 1627 డిశ్చార్జి

- ఇవాళ జిహెచ్ఎంసీ లో 116

2020-06-05 14:49 GMT

ఏరువాక పౌర్ణమి సందర్భంగా పాడేరు మండలం తుంపాడ లో సొంత పొలంలో నాగలి పట్టి, కొత్తలు కోస్తూ వ్యవసాయం పనులు చేస్తున్న మాజీ మంత్రి మణి కుమారి.



2020-06-05 14:45 GMT

- ప్రముఖ సైకిల్ కంపెనీ అట్లాస్ ప్రపంచ సైకిల్ దినోత్సవం రోజే తన చివరి యూనిట్లో మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

- కొనుగోలు చేసే వారు లేక యూనిట్లను మూసేస్తూ వచ్చిన కంపెనీ ప్రస్తుతం కరోనా దెబ్బకి కంపెనీ మూసేస్తున్నామని తెలిపింది ..

- దీంతో సుమారు 700 మంది ఉద్యోగస్తులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

- ఒక చరిత్ర ముగిసింది

 


2020-06-05 12:11 GMT

- 11వ తేదీ నుండి సాధారణ భక్తుల దర్శనానికి అనుమతి

- 8,9 తేదీలలో ఉద్యోగులకు దర్శనం

- 10వ తేదీ స్థానికులకు దర్శనం

-10సంవత్సరాల లోపు పిల్లలకు 65 ఏళ్ల వృద్దులకు అనుమతి లేదు.

-  టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

2020-06-05 10:13 GMT

చోడవరం: దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి... మధ్యాహ్నం స్వచ్ఛందంగా షాపులను మూసివేసి వ్యాపారులు లాక్​డౌన్​ పాటిస్తున్నారు. రాత్రి 9 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతిచ్చినా... కరోనా వైరస్ ప్రభావం ఎక్కువవుతుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలుగా దుకాణాలు మూసివేస్తున్నట్లు చోడవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పసుమర్తి వెంకట్ వివరించారు. 149 దుకాణాలు పాక్షిక లాక్​డౌన్​ను పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు.



 

 

2020-06-05 10:11 GMT

నర్సీపట్నం: వైద్యుడు సుధాకర్‌ కేసులో... సీబీఐ విచారణ నర్సీపట్నంలో రెండో రోజు కొనసాగుతోంది. ఇప్పటికే నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి సిబ్బందిని విచారించగా... రెండో రోజు విచారణలో భాగంగా పురపాలక సంఘ కార్యాలయంలో సిబ్బందిని విచారిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 6వ తేదీన జరిగిన ఘటనకు సంబంధించి వైద్యుడు సుధాకర్ చేసిన వ్యాఖ్యలపై ఈ విచారణ కొనసాగుతోంది.



 


2020-06-05 09:42 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 50 కొత్త కేసులు నమోదు అయ్యాయి.రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,831 శాంపిల్స్‌ని పరీక్షించగా 50 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు.



                                                                                   - పూర్తి వివరాలు

 

2020-06-05 09:26 GMT

విశాఖపట్నం: పర్యావరణానికి హాని కలగించే ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమను తరలించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో సీపీఎం, సీఐటీయూ, ఇతర ప్రజాసంఘాలు నిరసన చేపట్టాయి. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోపాలపట్నం పెట్రోల్ బంకు నుంచి మానవహారానికి వామపక్షాలు పిలుపునివ్వటంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. వామపక్ష నాయకులని ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. సీపీఎం కార్యాలయాలు, పార్టీ నాయకుల ఇళ్ల వద్ద పోలీస్ నిఘా ఏర్పాటు చేశారు. అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ పోలీసుల తీరుపై సీపీఎం నేత గంగారావు మండిపడ్డారు. అరెస్టుల ద్వారా ప్రభుత్వం ఉద్యమాన్ని ఆపలేదన్నారు.



 


2020-06-05 08:18 GMT

తిరుపతి:

👉ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య.

👉 తుమ్మలగుంట రోడ్డు లోని చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ ఎదురు సందులో ఘటన.

👉 పులివెందులకు చెందిన రాజా(55) కొంత కాలంగా సోనీ కుటుంబంతో కలసి సరస్వతి నగర్ లో కార్పెంటర్ గా జీవనం .

👉మద్యానికి అలవాటు పడ్డ రాజా సహచర మిత్రుడు రషీమ్ ను డబ్బు కావాలని డిమాండ్.

👉రషీమ్ లేదు ఆని చెప్పడంతో మనస్తాపానికి చెంది చీరతో కానుగ చెట్టుకు వురి వేసుకొని మృతి.

👉 వీఆర్వో సమక్షంలో మృతదేహాన్ని ఉరి నుండి తొలగించి వాహనంలో రూయా ఆసుపత్రికి తరలింపు.

👉 సంఘటనా స్థలానికి చేరుకున్న ఎంఆర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు

Tags:    

Similar News