ఏపీలో మరో 50 కరోనా పాజిటివ్‌ కేసులు

Arun Chilukuri
Published on: 5 Jun 2020 12:52 PM IST
ఏపీలో మరో 50 కరోనా పాజిటివ్‌ కేసులు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 50 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,831 శాంపిల్స్‌ని పరీక్షించగా 50 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో కృష్ణలో ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం కేసులు 3427. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 73. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,294కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1060 మంది చికిత్స పొందుతున్నారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story