Live Updates:ఈరోజు (జూలై-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-07-19 01:01 GMT
Live Updates - Page 2
2020-07-19 04:06 GMT

నేడు తూ.గో జిల్లాలో కర్ఫ్యూ..

కరోనా వైరస్ విలయాన్ని కాస్త కట్టడి చేసేందుకు తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. రెండు రోజుల క్రితం ప్రధాన పట్టణాల్లో లాక్ డౌన్ ప్రకటించినా ప్రయోజనం కనిపించకపోవడంతో పాటు ఏపీలోనే ఎక్కువ కేసులు నమోదు కావడంతో కర్ఫ్యూ విధించేందుకు సన్నద్ధమయ్యారు. నేటి నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు దీనిని కొనసాగించేందుకు జిల్లా యంత్రాంగం నిమగ్నమయ్యింది.

- పూర్తి వివరాలు 

2020-07-19 03:29 GMT

ఉరవకొండ పట్టణంలో ఓ మొబైల్ షాప్ లో చోరీ

ఉరవకొండ : అనంతపురం జిల్లా ఉరవకొండలోని విష్ణు మొబైల్ షాప్ లో చోరీ జరిగింది.

- శుక్రవారం రాత్రి షాప్ పైన ఉన్న రేకులను తొలగించి 50,000 విలువ గల సెల్ ఫోన్లు,2000 నగదును దొంగలించిన దుండగులు.

- మొబైల్ యాజమాని మధ్యాహ్నం చూడగా చోరీ జరిగిన సిసి పుటైజ్ లో దొంగతనం చేసిన దృశ్యాలు కనిపించాయి..

- యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

2020-07-19 02:57 GMT

వరవరరావు విడుదల కోసం వేడుకోలు..

విరసం నాయకుడు వరవరరావును వెంటనే విడుదల చేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభ్యర్థించారు. దీనిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. భీమా కోరేగావ్‌ కేసులో విచారణ ఖైదీగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రముఖ కవి, విరసం నాయకుడు వరవరరావును విడుదల చేసి, ఆయన ప్రాణాలను కాపాడాలని తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి..

- పూర్తి వివరాలు 

2020-07-19 01:48 GMT

రేపట్నుంచి ఉచిత రేషన్ సరుకులు పంపిణీ..

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నెలాఖరు నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత రేషన్ సరుకులు రేపట్నుంచి ఏపీలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందు లాక్ డౌన్ తరువాత అన్ లాక్ లు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు పేదలకు రేషన్తో పాటు కందిపప్పు లేదా శెనగలు ఉచితంగా అందించేందుకు నిర్ణయించాయి. ఈ సమయంలో కూలీ పనులకు అవకాశాలు తక్కువుగా ఉండటం వల్ల జీవనోపాధి కోల్పోతారని భావించిన ప్రభుత్వాలు వీటిని అందించేందుకు ఏర్పాటు చేశాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వం ఒకసారి, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అందించేలా చర్యలు తీసుకున్నాయి.  

- పూర్తి వివరాలు 

Tags:    

Similar News