Curfew in East Godavari District: నేడు తూ.గో జిల్లాలో కర్ఫ్యూ.. రేపు ఉదయం 6 గంటల వరకు

Curfew in East Godavari District: నేడు తూ.గో జిల్లాలో కర్ఫ్యూ.. రేపు ఉదయం 6 గంటల వరకు
x
East Godavari Curfew
Highlights

Curfew in East Godavari District: కరోనా విలయాన్ని కాస్త కట్టడి చేసేందుకు తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం నడుంబిగించింది.

Curfew in East Godavari District: కరోనా వైరస్ విలయాన్ని కాస్త కట్టడి చేసేందుకు తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. రెండు రోజుల క్రితం ప్రధాన పట్టణాల్లో లాక్ డౌన్ ప్రకటించినా ప్రయోజనం కనిపించకపోవడంతో పాటు ఏపీలోనే ఎక్కువ కేసులు నమోదు కావడంతో కర్ఫ్యూ విధించేందుకు సన్నద్ధమయ్యారు. నేటి నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు దీనిని కొనసాగించేందుకు జిల్లా యంత్రాంగం నిమగ్నమయ్యింది. దీనిని దిక్కరించిన వారిపై కేసులు నమోదు చేసేలా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో క‌రోనా కేసులు భారీగా నమోదవుతున్న నేప‌థ్యంలో 24 గంట‌ల పాటు జిల్లా వ్యాప్తంగా క‌ర్ఫ్యూ అమ‌లుకు క‌లెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రేపు(ఆదివారం) ఉ.6 గంటల నుండి సోమవారం ఉ.6 గంటల వరకు జిల్లా అంతటా కర్ఫ్యూ విధిస్తున్న‌ట్లు తెలిపారు. అత్య‌వ‌స‌ర వైద్య‌సేవ‌లు, మెడిక‌ల్ షాపుల‌కు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉంద‌ని, మిగ‌తా అన్ని సేవ‌లు తాత్కాలికంగా మూసివేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో గత రెండురోజుల్లోనే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు ధిక్కరించిన వారిపై ఎపిడిమిక్ డిసీజ్ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తామ‌ని హెచ్చ‌రిక జారీ చేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధి పోలీసు స్టేషన్లలో క‌రోనా కేసులు అధిక‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు అక్క‌డ 14 మంది పోలీసు సిబ్బందికి క‌రోనా సోకిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories