Live Updates:ఈరోజు (ఆగస్ట్-01) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 01 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-01 01:23 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 01 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం త్రయోదశి (రాత్రి 9-48 వరకు) తదుపరి చతుర్దశి; మూల నక్షత్రం (ఉ. 7-48 వరకు) తదుపరి పూర్వాషాఢ నక్షత్రం, అమృత ఘడియలు (రాత్రి 2-43 నుంచి 4-17 వరకు), వర్జ్యం (ఉ. 6-15 నుంచి 7-48 వరకు తిరిగి సా. 5-15 నుంచి 6-50 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-42 నుంచి 7-24 వరకు తిరిగి మ. 12-32 నుంచి 1-23 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-31

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-08-01 15:15 GMT

- తాడేపల్లిగూడెం చేరుకున్న మాజీ మంత్రి మాణిక్యాలరావు పార్థివదేహం..

- మరికాసేపట్లో మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలు

- తాడేపల్లిగూడెం లో మామిడితోటలోని హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు

- అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల ఏర్పాట్లు చేసిన ఏలూరు ఆర్డీఓ, కొవ్వూరు డీఎస్పీ

- కుటుంబ సభ్యుల సమక్షంలో పరిమిత సంఖ్యలో అంత్యక్రియలకు అనుమతి

2020-08-01 15:12 GMT

అనంతపురం: జిల్లా అంతటా 24 గంటల పాటు నిషేధాజ్ఞలు అమలు.

- అత్యవసర సేవలకు మినహాయింపు.

- ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.

- కరోనా వైరస్ కట్టడి చర్యలలో భాగంగా

-రేపు ఉదయం 6:00 గంటల నుంచి సోమవారం ఉదయం 6.00 గంటల వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలు .

- అత్యవసర సేవలు మినహా ప్రజలు బయటకు వస్తే చర్యలు.

- సి ఆర్ పి సి సెక్షన్ 144 కింద జిల్లాలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడడం నిషేధం.

2020-08-01 14:16 GMT

- కదిరి బాబు రావు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే.

- బీజేపీ నేత, మాజీ మంత్రి మణిక్యాల రావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబు రావు.

- మాణిక్యాలరావు నాకు మంచి మిత్రుడు.

- గత శాసన సభలో ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న మణిక్యాల రావు గారితో కలిసి పని చేశాం.

- మాణిక్యాలరావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

2020-08-01 14:15 GMT

- మాజీమంత్రి పైడికొండ మాణిక్యాలరావు మృతికి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

- మాణిక్యాలరావు మృతి వార్త షాక్ కు గురిచేసిందన్న గవర్నర్

- దేవాదాయ శాఖామంత్రిగా మాణిక్యాలరావు సేవలు గుర్తుంటాయన్న గవర్నర్

- పైడికొండల మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపిన గవర్నర్

2020-08-01 14:14 GMT

- ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...

- రాజ్యసభ ఎంపి, సీనియర్ నాయకుడు అమర్ సింగ్ గారి మరణం బాధాకరం

- పార్టీలకు అతీతంగా బలమైన స్నేహాన్ని పెంచుకోగల ఆయన లాంటి రాజకీయ నాయకుడిని కనుగొనడం చాలా అరుదు.

- వారి కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి మరియు ప్రార్థనలు.

2020-08-01 14:00 GMT

- నూతన సచివాలయం భావన నిర్మాణం.

- నియంత సాగు పద్దతిలో వ్యవసాయం.

- కరోనా వైరస్, విద్యరంగం పై పరిస్తితిపై చర్చ.  

2020-08-01 13:48 GMT

- ఆదిలాబాద్ తాంసి మండలం గోల్లఘాట్, తాంసి కే గ్రామ సమీప ప్రాంతాలలో పులి సంచారం..

- పులి సంచారంతో అందోళన చెందిన ప్రజలు..

- పంటపోలాలకు వెళ్లాలంటే భయపడుతున్నా రైతులు..

- పులి అనవాళ్లకు సంబంధించిన. పాదముద్రలను ఏర్పాటు చేసిన అటవీ అదికారులు..

- పులి కదలికలు గుర్తించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన‌ అటవీ అదికారులు

2020-08-01 13:45 GMT


- నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే హిందూపూర్

- మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావుగారి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది.

- తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా సేవలందించారు.

- వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి


2020-08-01 13:40 GMT

- హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి పెద్ద పెద్ద రాళ్లు ఇళ్లు పైనా పడుతున్నాయి

- హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 ప్రమాదం...

- భారీ వర్షానికి పెద్ద రాయి పడి రాయి పెచ్చలు ఓ ఇంటిపై పడడంతో డ్యామేజ్ అయిన ఇల్లు...

- ఇంట్లోని సామగ్రి పూర్తిగా ధ్వంసం...

- డ్యామేజ్ అయిన ఇంటి ప్రక్కనే జరుగుతున్న నిర్మాణాలు...

- దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చెసిన బాధితులు...

2020-08-01 06:40 GMT

- రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ అమోదించడం స్వాగతిస్తున్నాం...

- సిఎం అన్నిప్రాంతాలు అభివృద్ధి చేయాడానికే ఈనిర్ణయం...

- చంద్రబాబు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు...

- అవసరం లేకపోయిన 33వేల ఎకరాలు సేకరించారు.....

- రాజధాని పేరుతో చంద్రబాబు ఉద్యమం లేపారు...

- ప్రజలు అన్ని ప్రాంతాల అభివృద్ధి కోరుకుంటున్నారు...

- రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ

Tags:    

Similar News