Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-17 01:18 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 17 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అమావాస్య సా.5-06 వరకు తదుపరి పాడ్యమి | పుబ్బ నక్షత్రం ఉ.10-58 వరకు తదుపరి ఉత్తర | అమృత ఘడియలు: ఉ.6-23 వరకు తిరిగి తె.2-47 నుంచి 4-17 వరకు | వర్జ్యం: సా.5-44 నుంచి 7-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-54 నుంచి 10-42 వరకు తిరిగి మ.2-45 నుంచి 3-34 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-00

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-17 12:45 GMT

వరంగల్ అర్బన్..

-హన్మకొండ వెయ్యిస్థంబాల దేవాలయంలో పెత్రామవాస్య రోజు తొలి బతుకమ్మ వేడుకలు.

-ఎగువమాసం వచ్చిన ఓరుగల్లు మహిళలు నేడు ఆచారం ప్రకారం అమావాస్య రోజు బతుకమ్మ పండుగను అధిపడినా ఆడపడుచులు.

-ప్రపంచంలో తొలి బతుకమ్మ ఓరుగల్లులోనే ప్రారంభం అవుతుందిమ్ ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నాం అంటున్న మహిళలు.

-తొలి రోజు బతుకమ్మ ఆడిపాడి, వాయినాలు ఇచ్చిపుచ్చుకున్న మహిళలు, యువతులు.

-బతుకమ్మ వేడుకలకు ఎలాంటి తిధులు లేవని , ఇది మహిళల ఆత్మగౌరవం అంటున్న ఓరుగల్లు మహిళలు..

2020-09-17 11:54 GMT

జిహెచ్ఎంసి..

-జిహెచ్ఎంసి పరిధిలో నిర్మాణమవుతున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష.

-హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని ఇది త్వరగా పూర్తి అవుతాయని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు

-లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశం

-డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేసిన ప్రాంతాల్లో గ్రీనరీ కి పెద్దపీట వేయాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ

-హౌసింగ్ శాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం జిహెచ్ఎంసి పరిధిలో జిహెచ్ఎంసి కమిషనర్ మరియు ఇతర జిల్లాల కలెక్టర్లతో సంయుక్తంగా లబ్ధిదారులను     ఎంపిక చేయాలని సూచన

-జిహెచ్ఎంసి పరిధి అవతల నిర్మాణం జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లో స్థానికులకు పది శాతం లేదా 1000 మించకుండా కేటాయించాలని మంత్రులు   ఆదేశం

-గతంలో ఇల్లు వచ్చిన వారికి మరొకసారి డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకుండా చూడాలని అధికారులకు సూచన

2020-09-17 11:44 GMT

జాతీయం..

నామా నాగేశ్వరరావు, టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత..

-10 ప్రాంతీయ పార్టీల ఎంపీలు ధర్నాలో పాల్గొన్నారు

-తెలంగాణ రాష్ట్ర సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్ కోరాం

-తెలంగాణ కు రావాల్సిన జిఎస్టీ బకాయిలు చెల్లించాలి

-9 వేల కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం

-కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోయాయి.

-తెలంగాణ ప్రజల కోసం ఎవరితోనైనా పోరాడుతాం

-జిఎస్టీ బకాయిల చెల్లింపుపై వాయిదా తీర్మానం ఇచ్చా... చర్చ కోసం పట్టుపడతాం

-విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలన్ని కేంద్రం ఇవ్వాలి

వెంకటేష్ నేత, టిఆర్ఎస్ ఎంపీ..

-రాష్ట్రాలకు రావాల్సిన నిధులనే హక్కుగా అడుగుతాం

-మా నిధులు మాకు ఇవ్వాలని పోరాటం చేస్తాం

2020-09-17 11:16 GMT

ఖమ్మం.. 

-బత్తుల ప్రతాప్ వర్గం ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారని ఆందోళన కు దిగిన యడ్లపల్లి సంతోష్ వర్గం

-పరస్పరం దాడి చేసుకున్న ఇరువర్గాల యువజన కాంగ్రెస్ కార్యకర్తలు

2020-09-17 11:12 GMT

తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు జోస్న@ఎన్టీఆర్ భవన్ హైదరాబాద్

* 2014 తెలంగాణ ఏర్పాటు జరిగిన నుంచి ప్రజలను కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నారు.

* ఎన్ని రోజులైనా అసెంబ్లీ నిర్వహిస్తా అన్న కేసీఆర్ వారం రోజులకే ముగించారు.

* 4వందల మంది స్టాఫ్ ఉండే అసెంబ్లీ గురించి ఆలోచన చేసిన కేసీఆర్..4 కోట్ల ప్రజల బాధలు కనిపించడం లేదా?

* కొరొనాను ఆరోగ్యశ్రీ చేర్చడానికి టీఆరెస్ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటో చెప్పాలి.

* ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఎల్ ఆర్ ఎస్ వెంటనే జివో లో సవరణ చేసింది...ఇది ప్రజల విజయం.

* తెలంగాణ లో మహిళా కమిషన్ ను ఏర్పాటు చేసేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాము.

* హైదరాబాద్ అభివృద్ధికి అసెంబ్లీ సాక్షిగా 65వేల కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ చెప్పారు.

* పది సెంటిమిటర్ల వర్షం పడితే బోగతా-నాయగరా వాటర్ ఫాల్ హైదరాబాద్ నడిబొడ్డున కనిపిస్తున్నాయి.

* 500 కోట్ల సచివాలయం టెండర్లు పిలిచిన ప్రభుత్వం..చదువు చెప్పే గురువులను ఆదుకోవడం లేదు ఎందుకు?

* కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో నాగులు లాంటి వ్యక్తులు ఎందరో బలి అవుతున్నారు.

* తెలంగాణ విమోచనరోజు నాగులు లాంటి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది అనే ఒక్క ప్రకటన చేయలేరా?

2020-09-17 11:09 GMT

టీటీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ..

-తెలంగాణ లో దొరల పాలన అంతమై ప్రస్తుతం నెలకొన్న నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపు..

-నిజాం పాలనలో ఎక్కడ చూసినా నిరంకుశత్వం పెత్తందారి పాలన చెప్పుచేతల్లో తెలంగాణ నలిగిపోయింది..

-ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలినమైంది ..

-తెలంగాణలో ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేయడంతో ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం సిద్ధించింది...

2020-09-17 11:05 GMT

-దేవిక రాణి భర్త గురుమూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న ఈడీ...

-పీ ఎం జే లో 7 కోట్ల కు పైగా విలువ చేసే బంగారం కొనుగోలు చేసిన దేవిక రాణీ...

-బంజారాహిల్స్ పీ ఎం జే జువెలర్స్ యాజమానుల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడి...

-నిధులు మళ్లించడానికి అనేక షెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్న ఐ ఎం ఎస్ నిందితులు...

2020-09-17 10:11 GMT

టీఎస్ హైకోర్టు....

-గతంలో ఈ కేసు లో స్పెషల్ అధికారి గా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ను నియమించిన హైకోర్టు..

-శీలం రంగయ్య డెత్ కు సంబంధించిన రిపోర్ట్ ను కోర్ట్ కు సమర్పించిన సీపీ అంజనీ కుమార్...

-రామగుండం పోలీసు కమీషనర్ కాల్ డేట హైకోర్ట్ కు అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం.

-సీపీ సమర్పించిన అఫిడవిట్ పై కౌంటర్ దాఖలు చేస్తామన్న పిటీషనర్ నాగమణి..

-ఆరు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటీషనర్ కు హైకోర్టు అదేశం..

-తదుపరి విచారణ ఆరు వారాల పాటు వాయిదా వేసిన హైకోర్ట్.

2020-09-17 10:09 GMT

హైదరాబాద్..

-నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా ఎగువ ప్రాంతం నుంచి పురానాపూల్ కొట్టుకొచ్చిన మొసలి...

-సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, జూ పార్క్ సిబ్బంది..

-మోసలి ని బంధించే పనిలో నిమగ్నమైన సిబ్బంది....

2020-09-17 10:07 GMT

తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర మంత్రి..

-ఇంకా 60 ప్రాంతాల్లో పర్యటించాల్సిఉంది..

-కోల్లురూ ,మేడ్చల్ ,జవహర్ నగర్ ,కుత్బుల్లాపూర్ లాంటి ప్రాంతంల్లో రేపు పర్యటన ఉంటుంది..

-ఇంతకు ముందు ప్రభుత్వాలు ఇచ్చే ఇళ్ళకు ప్రభుత్వం కొంత సొమ్ము వసూలు చేసేది.. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ళు పూర్తి గా ఫ్రీ ఇస్తున్నాం.

-ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూం విలువ కోటి రూపాయలు ఉంటుంది.

-గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష ఇళ్ళ నిర్మాణానికి పదివేల కోట్లు ఖర్చు పెడుతున్నాం..

-బస్తి ప్రజల సమక్షంలో ఇళ్ళ పంపిణీ చేస్తాం..

-ఆలస్యమయినా క్వాలిటీ ఇళ్ళు కడతాం..

-లక్ష ఇళ్ళు కాంగ్రెస్ నేతలకు చూపిస్తాం...

-గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేపు కూడా ఈ పర్యటన ఉంటుంది.

Tags:    

Similar News