Live Updates: ఈరోజు (సెప్టెంబర్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-17 01:13 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 17 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అమావాస్య సా.5-06 వరకు తదుపరి పాడ్యమి | పుబ్బ నక్షత్రం ఉ.10-58 వరకు తదుపరి ఉత్తర | అమృత ఘడియలు: ఉ.6-23 వరకు తిరిగి తె.2-47 నుంచి 4-17 వరకు | వర్జ్యం: సా.5-44 నుంచి 7-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-54 నుంచి 10-42 వరకు తిరిగి మ.2-45 నుంచి 3-34 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-00

ఈరోజు తాజా వార్తలు 

Live Updates
2020-09-17 13:56 GMT

తూర్పుగోదావరి :

- భయం గుప్పిట్లో గొల్లప్రోలు, పిఠాపురం మండలాలు

- ఇప్పటికే వరద ముంపులో 25 వేల ఎకరాలు, నీట మునిగిన పలు కాలనీలు..

2020-09-17 12:38 GMT

కడప :

మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కామెంట్స్ ...

-అటవీశాఖ భూములను ఆక్రమించినట్లు టిడిపి ఇన్ చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ చేసిన అరోపణలు నెల రోజుల్లో నిరూపించాలి...

-నిరూపించని పక్షంలో మైదుకూరు నాలుగురోడ్ల కూడలిలో తప్పు ఒప్పుకొని, లెంపలు వేసుకోవాలి..

-లేనిపక్షంలో చట్టపరంగా తీసుకొనే చర్యలకు సిద్ధంగా ఉండాలి..

-గత ప్రభుత్వ హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు..

-అప్పట్లో ప్రభుత్వాన్ని మోసం చేసి కోట్లు సంపాదించారు..

-అలాంటి వ్యక్తి కి నాపై విమర్శలు చేసే హక్కు లేదు..

-తొందరలోనే సుధాకర్ యాదవ్ అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతా..

2020-09-17 12:36 GMT

విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు..

-గుడి ఈఓను కూడా పిలిచాం సంఘటన జరగడానికి ముందే

-మొత్తం ప్రార్ధన మందిరాల వారిని కూడా పిలిచాం

-దుర్గగుడి సంఘటన జరగడానికి ముందే మీటింగ్ పిలిచి సీసీ కెమెరాలు పెట్టమన్నాం

-దేవాలయాలు, ప్రార్ధన మందిరాల వారు వాలంటీర్లను పెట్టుకోవాలి

-సీసీఎస్ కూడా దుర్గ గుడి సంఘటనపై విచారణ చేస్తారు

2020-09-17 12:34 GMT

విజయవాడ..

విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు

-48.50లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని డాక్టర్ మురళీధర్ కంప్లైంట్ ఇచ్చారు

-ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది సూత్రధారులు, పాత్రధారులు

-కేటరింగ్ నాగేంద్ర, పీఆర్ఓ మెండెం విజయ్, తాడేపల్లికి చెందిన క్రిమినల్స్ తో కలిసి డెకాయిటీ చేసారు

-ఇప్పటికి ఐదుగురిని అరెస్టు చేసాం

-నగదు 34.75లక్షల రూపాయలు, 48గ్రాముల బంగారం రికవరీ చేసాం

-వెస్లీ అనే వ్యక్తికి నేర చరిత్ర ఉంది

-ప్రతీ నెల లక్షల్లో బ్యాంకు ఈఎంఐ లు కట్టాలని డాక్టర్ తెలిపారు

-మొత్తం బిల్డింగ్ మరమ్మత్తులు జరిగిన తరువాత సీసీ కెమెరాలు పెడతామన్నారు డాక్టర్

-20 లక్షలు కట్టామని డాక్టర్ భార్యతో నిందితులు చెప్పారు

-పీఆర్ఓ నే ముందుగా డాక్టర్ భార్యను ఎవరో బయట అనుమానాస్పదంగా తిరుగుతున్నారని అలర్ట్ చేసారు

2020-09-17 12:25 GMT

తూర్పు గోదావరి జిల్లా-అమలాపురం..

సబ్ కలెక్టర్ కౌశిక్

-ముందు స్థలము లేకుండా సభలు సమావేశాలు నిర్వహించి రాదు

-ప్రజలు గుంపులు గుంపులుగా తిరగవద్దు

 డిఎస్పి బాషా హెచ్చరిక

-చలో అమలాపురానికి అనుమతి లేదు :

-డి ఐ జి కె వి మోహన్ రావు

-రేపు చలో అమలాపురానికి పిలుపునిచ్చిన బిజెపి

-అంతర్వేది సంఘటనలో కేసులు ఎత్తివేయాలని డిమాండ్ తో చలో అమలాపురం పిలుపునిచ్చిన బిజెపి

-బిజెపి నాయకులను ముందస్తు హౌస్ అరెస్టు చేస్తున్న పోలీసులు

2020-09-17 12:16 GMT

తిరుమల..

-తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపద్యంలో ముఖ్యమంత్రి ని కలిసి తిరుమలకి ఆహ్వానిచిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి,

-ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మ రెడ్డి

-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించిన టిటిడి ఈఓ అనీల్ కుమార్ సింఘాల్

2020-09-17 12:12 GMT

అమరావతి..

-రేపు చలో అమలాపురం కు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారిని విజయవాడలో నిర్బంధించిన విజయవాడ పోలీసులు

-ప్రస్తుతం అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30,144 అమల్లో ఉన్నందున ముందస్తు నిర్బంధం చేసిన పోలీసులు

2020-09-17 12:04 GMT

జాతీయం..

-Covid 19 చర్యలపై రాజ్యసభలో చర్చ సందర్భంగా చోటు చేసుకున్న మాటల యుద్ధం.

-కరోనా నియంత్రణ చర్యలపై మాట్లాడాల్సిన విజయసాయిరెడ్డి ఏసీబీ విచారణ, కోర్టుల జోక్యం అంటూ ఇతర అంశాలను ప్రస్తావించడంపై కనకమేడల తీవ్ర   అభ్యంతరం.

-అనవసర అంశాలపై ప్రస్తావన తెస్తూ సభను తప్పుదోవ పట్టించడం తగదన్న కనకమేడల రవీంద్ర కుమార్

-సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ కోర్టుల పరిధిలోని అంశాలపై చర్చించడం పై తీవ్ర అభ్యంతరం.

-కోర్టు పరిధిలోని అంశాలపై పార్లమెంటులో మాట్లాడడం ద్వారా కోర్టులను కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని కనకమేడల అభ్యంతరం.

-విజయసాయిరెడ్డి మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ని కోరిన తెలుగుదేశం ఎంపీ.

-ఏసీబీ విచారణ, కోర్టుల జోక్యం లాంటి అంశాలపై మాట్లాడరాదంటూ విజయసాయిరెడ్డిని వారించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్.

-సంబంధిత అంశానికి మాత్రమే పరిమితం కావాల్సిందిగా సూచించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ నారాయన్.

2020-09-17 11:50 GMT

అమరావతి..

-అన్నదాతల పై కేసులు పెట్టడం జగన్ రెడ్డి గారి దిగజారుడుతనానికి నిదర్శనం.

-కడుపు మండి రోడ్డెక్కిన రైతులని కేసుల పేరుతో వేధించడం దారుణం.

-ధాన్యం కొనుగోలు చెయ్యకుండా ప్రభుత్వం చేతులెత్తేయడంతో నెల్లూరు జిల్లాలో రైతుల్ని దళారులు దోచుకుంటున్నారు.

-నెల్లూరు జిల్లా సంగంలోని జాతీయ రహదారి పై ధర్నా నిర్వహించిన 15 మంది రైతుల పై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి.

2020-09-17 11:31 GMT

పశ్చిమ గోదావరి జిల్లా..

- ఏలూరు రేంజ్ డిఐజి మోహనరావు..

-నూతన రథం నిర్మాణం కూడా ప్రారంభించాం

-వివాదంలో అరెస్ట్ అయిన హిందూవాదులు విడుదలయ్యారు

-ఇంకా పలు రాజకీయ, మత సంస్థలు ఛలో అంతర్వేది కి వస్తున్నారు

-తూర్పుగోదావరి జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది

-కోనసీమలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు

-ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు ఉంటాయి

Tags:    

Similar News