Live Updates:ఈరోజు (ఆగస్ట్-16) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-16 01:16 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 16 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ద్వాదశి(ఉ. 11-03 వరకు) తదుపరి త్రయోదశి ; పునర్వసు నక్షత్రం (తె. 05-41 వరకు) తదుపరి పుష్యమి నక్షత్రం, అమృత ఘడియలు (లేవు), వర్జ్యం (సా.05-29 నుంచి 07-06 వరకు) దుర్ముహూర్తం (సా. 04-42 నుంచి 05-32 వరకు) రాహుకాలం (సా.04-30 నుంచి 06-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23

ఈరోజు తాజా వార్తలు 

Live Updates
2020-08-16 17:16 GMT

 నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో  భారీగా పెరుగుతున్న వరదనీరు

ప్రస్తుతం నీటిమట్టం: 696.775 Ft

ప్రస్తుతం నీటి నిల్వ: 6.787TMC

ఇన్ ప్లో: 18930 c/s

అవుట్ ప్లో : 12485 c/s

రెండు గెట్లను ఎత్తి 12114 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలిన అదికారులు

2020-08-16 17:11 GMT

వరంగల్ అర్బన్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యల కోసం ప్రభుత్వం హై అలెర్ట్ ఉన్న జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది.

జిల్లాకు వ్యవసాయ శాఖ కమిషనర్ జనార్దన్ రెడ్డి ని పర్యవేక్షణ అధికారిగా నియమించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. 

2020-08-16 17:09 GMT

కుమ్రంబీమ్ జిల్లా బెల్గామ్ వాగులో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు సురక్షితం..

ముగ్గురు వ్యక్తులను కాపాడిన పోలీసులు..

‌తాళ్ల సాయంతో చేపల వేటకు వెళ్లిన వారిని కాపాడిన పోలీసులు..

పోలీసులకు  కృత‌జ్ఞ‌త‌లు  తెలిపిన ముగ్గురు వ్యక్తులు


2020-08-16 17:05 GMT

కరోనా సోకిందనే భయంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిదిలో చేసుకుంది.

క్యాప్ జెమినీ సంస్థ లో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శిల్పా రెడ్డి కరోనా సోకిందనే భయంతో తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య

కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్న పోలీసులు  

2020-08-16 17:03 GMT

మిడ్ మానేర్ శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి కొనసాగుతున్న వరద.

ఇన్ ఫ్లో 2186 క్యూసెక్కులు.

ఔట్ ఫ్లో 149 క్యూసెక్కులు (మిషన్ భగీరథ అవసరాలకు)

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 25.873 టీఎంసీలు.

ప్రస్తుత నీటిమట్టం 20.47 టీఎంసీలు.

2020-08-16 16:59 GMT

తెలంగాణ లో అమీన్పూర్ లో బాలిక రేప్ ఘటనపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ సీరియస్

అనాధాశ్రమంలో బాలిక రేప్ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్

ఘటనపై వారం రోజుల్లోగా పూర్తి వివరాలు పంపాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఆదేశం

పోస్టుమార్టం రిపోర్టు, కేసు దర్యాప్తు నివేదిక పంపాలని కోరిన జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరాండే ఆదేశం

2020-08-16 16:58 GMT

కరీంనగర్ : లోయర్ మానేరు డ్యాంలోకి మోయ తుమ్మెద వాగు నుంచి కొనసాగుతున్న భారీ ఇన్ ఫ్లో.

- పూర్తి స్థాయి నీటి మట్టం 920 అడుగులు కాగా.. ప్రస్తుతం 909.40 అడుగులు

- పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 15.850 టీఎంసీలు

- ఇన్ ఫ్లో: 26 వేల 937 క్యూసెక్కులు(మోయతుమ్మెద, మానేరు వాగుల నుంచి) 

2020-08-16 16:54 GMT

- క్షణక్షణానికి పెరుగుతున్న నీటిమట్టం...

- పెరుగుతున్న నీటిమట్టం తో అప్రమత్తమైన అదికారులు..

- రాత్రి పదిగంటలకు వరదనీటిని విడుదల చేస్తామని ప్రకటించిన అదికారులు

- దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన అదికారులు..

- పరివాహక ప్రాంతంలో కి రావద్దని ప్రజలకు హెచ్చరికలు జారీచేసిన అదికారులు

2020-08-16 16:52 GMT

నిర్మల్ కుబీర్ మండలం దొడార్న నం1 తండా వద్ద ఉప్పోంగిన వాగు

- వాగు అవతలివైపు చిక్కుకున్న తండావాసులు

- వాగు బయట ఉన్నవారిని త్రాడుతో రక్షించిన పోలీసులు 

2020-08-16 16:50 GMT

 కరీంనగర్ : పెద్దపల్లి ఎమ్మెల్యే పై కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు

బొమ్మకల్ గ్రామం లో సర్వే నంబర్ 28 లో స్థలం కబ్జా చేసినందుకు చర్యలు తీసుకోవాలని పిర్యాదు

పిర్యాదు చేసిన కాంగ్రెస్ అధికార ప్రతినిది దాసరి భూమయ్య

Tags:    

Similar News