Live Updates:ఈరోజు (ఆగస్ట్-02) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-02 01:18 GMT
Live Updates - Page 2
2020-08-02 11:46 GMT

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు కరోనా పాజిటివ్

- కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు కరోనా పాజిటివ్

- ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అమిత్ షా

- కరోనా లక్షణాలతో టెస్ట్ చేయించుకున్న అమిత్ షా

- నా ఆరోగ్యం బాగానే ఉంది

- వైద్యుల సలహా మేరకు నన్ను ఆసుపత్రిలో చేర్పించారు

- గత కొద్ది రోజులుగా నాతో సంప్రదించిన వారంతా కరోనా టెస్టులు చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాను.

2020-08-02 11:39 GMT

బిగ్ బీ అమితాబచ్చన్ కు కరోనా నెగిటివ్

- బిగ్ బీ అమితాబచ్చన్ కు కరోనా నెగిటివ్

- హాస్పటల్ నుండి డిశ్చార్జ్, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన  అభిషేక్ బచ్చన్

2020-08-02 11:22 GMT

శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం

- శ్రీకాకుళం జిల్లలో కంచిలిల దగ్గర ఘోర రోడ్ ప్రమాదం.

- లారీని డీకోట్టిన స్కార్పియో, ముగ్గురు మృతి.

- మృతులు పచ్చిమబెంగాల్ లోని ఖరగ్ పూర్ వాసులుగా గుర్తింపు.   

2020-08-02 11:16 GMT

థియేటర్ వర్కర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ

రాజమండ్రి :

నగరంలోని స్వామి థియేటర్ వద్ద సినిమా థియేటర్ వర్కర్లకు ఆదివారం నిత్యావసర సరుకులు, రూ. 500 నగదు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్ హాజరై ఆయన చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సినిమా ధియేటర్ వర్కర్లు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

2020-08-02 11:11 GMT

చింతకుంట గ్రామంలో ఘర్షణ.. ఐదుగురికి గాయాలు

అనంతపురం: పుట్లూరు మండలం చింతకుంట గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొని 5 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పుట్లూరు ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ పోలీసు జీవులో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

2020-08-02 11:10 GMT

అనాధ బాలికలకు సాయం అందిస్తున్న దాతలు

సంతబొమ్మాళి: మండలం నౌపడలో తల్లిదండ్రులు కోల్పోయి అనాధలైన బాలికలు స్వాతి, పల్లవిలకు సాయం అందించడానికి పలువురు స్పందిస్తూ ముందుకు వస్తున్నారు. ఈ మేరకు ఆదివారం నౌపడకు చెందిన కళింగ కోమట్ల సంఘం చైర్మన్ వరాహ నరసింహ మూర్తి, వైస్ ప్రెసిడెంట్ కొంచాడ దుర్గారావు, కళింగ కోమట్ల సంఘం జిల్లా నెంబర్ దుంప మోహన్ రావులు ఆ బాలికలకు15,000 రూపాయలు అందజేశారు. అలాగే శ్రీకాకుళంకు చెందిన జీల్ ఫౌండేషన్ నిత్యావసర సరుకులు, బియ్యం అందించారు.


2020-08-02 07:45 GMT

కోనసీమలో కర్ఫ్యూ

తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం: 

- కోనసీమలో ప్రశాంతంగా కొనసాగుతున్న కర్ఫ్యూ

- ఇళ్లకే పరిమితమైన జనం

- అత్యవసర సేవలకు మినహాయింపు

- కోనసీమలో కర్ఫ్యూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్న డి.ఎస్.పి మశుం భాష

2020-08-02 07:42 GMT

మాణిక్యాలరావుకు బీజేపీ నేతల నివాళి

గుంటూరు: బిజేపి ఆఫీస్ లో మాజీ మంత్రి మాణిక్యాలరావు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించిన బిజేపి నేతలు కన్నా లక్ష్మి నారాయణ, యడ్లపాటి రఘునాధ బాబు, మాజీ మంత్రులు శనక్కాయల అరుణ, రావెల ,

- మాణిక్యాలరావు 9 వఏటనే సంఘ్ కార్యక్రమాలలో పాల్గోనేవాడు.

- పశ్చిమ గోదావరి జిల్లాలో బిజేపి అభివృద్ధి కి కృషి చేశారు.

- తాడేపల్లిగూడెం బిజేపి అభ్యర్దిగా గెలుపొంది మంత్రిగా పని చేశారు.

- పార్టీ ఏ పని అప్పగించిన చిత్త లు తో నిర్వహించేవారు. 

- మాణిక్యాలరావు లాంటి నిబద్దత కల వ్యక్తిని ఏపి బిజేపి కోల్పోయింది.

- మాణిక్యాలరావు కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం...

2020-08-02 07:35 GMT

దళితులపై దాడులకు నిరసనగా ఆందోళన

గుంటూరు జిల్లా,తెనాలిలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఆందోళన...

- తెనాలి రజక చెరువు సెంటర్ లో దీక్షా  శిబిరం ఏర్పాటు చేసి నిరసన.

- ధీక్ష శిబిరాన్ని భగ్నం చేసిన పోలీసులు

2020-08-02 07:31 GMT

షిప్ యార్డ్ ప్రమాద మృతులకు కేజీహెచ్ లో పోస్టుమార్టం

విశాఖ: హిందూస్థాన్ షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు కేజీహెచ్ లో పోస్టుమార్టం.

కేజీహెచ్ మార్చురీ వద్ద రోధిస్తున్న మృతుల బంధువులు.

కనీసం యాజమాన్యం స్పందించలేదని వాపోతున్న బాధిత కుటుంబాలు.

ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన కమిటీలు

Tags:    

Similar News